
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వయసు 73 ఏళ్లు. అయినా కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సూపర్ స్టార్. గతేడాది రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వారి డిమాండ్ మరింత పెరిగింది. జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆయన నటించిన ‘లాల్ సలామ్’ చిత్రం విడుదలవుతోంది. ఫిబ్రవరి 9న విడుదలవుతున్న ఈ సినిమా అభిమానులలో అంచనాలు పెంచింది. ఈ సినిమాకు రజనీకాంత్ ఎంత పారితోషికం తీసుకున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
‘లాల్ సలామ్’ సినిమాలో రజనీకాంత్ చేసింది మెయిన్ రోల్ కాదు.ఆయన అతిథి పాత్రలో కనిపించాడు. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆయన పాత్ర కనిపిస్తుంది. అలాగే ఆయన పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది దాంతో రజనీకాంత్ ఈ పాత్రను అంగీకరించి నటించారు.
రజనీకాంత్ పోషించిన పాత్ర పేరు మొయిద్దీన్ భాయ్. ఆ పాత్రలో ఆయన గెటప్ అందరినీ ఆకర్షిస్తోంది. ‘లాల్ సలామ్’ సినిమాలో ఈ పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. అందుకు గాను ఆయన 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. అంటే నిమిషానికి కోటి రూపాయలు వసూలు చేసినట్లే. ఈ వార్త విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలామ్’. తన కూతురు దర్శకత్వం వహించిన సినిమా అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదట సూపర్ స్టార్. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ‘లాల్ సలామ్’ చిత్రానికి పెట్టుబడి పెట్టింది. ఈ సినిమాలో హిందూ-ముస్లిం ఆధ్యాత్మికత కథ ఉంటుందని అంటున్నారు. ట్రైలర్‌లో దానికి సంబంధించిన సన్నివేశాలు చూపించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.