Bollywood : రోడ్డు పై తాగి తూలుతూ కనిపించిన హీరో.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నటుడు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కు సంబంధించింది. ఈ వీడియోలో సన్నీ డియోల్ పరిస్థితిని చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే అతను ముంబైలోని జుహు సర్కిల్ ప్రాంతంలో తాగిన స్థితిలో కనిపించాడు. అతను బిజీ రోడ్ లో తాగి తడబడుతూ..కనిపించాడు.
సోషల్ మీడియాలో ఒక ఫోటో లేదా ఓ వీడియో వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒకవేళ అది ఏ సెలబ్రెటీలదో అయితే ఇక చెప్పనక్కర్లేదు. గాలి కంటే వేగంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నటుడు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కు సంబంధించింది. ఈ వీడియోలో సన్నీ డియోల్ పరిస్థితిని చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే అతను ముంబైలోని జుహు సర్కిల్ ప్రాంతంలో తాగిన స్థితిలో కనిపించాడు. అతను బిజీ రోడ్ లో తాగి తడబడుతూ..కనిపించాడు. తూగుతూ సన్నీ డియోల్ ఓ ఆటోకు అడ్డుపడ్డాడు. వెంటనే ఆ ఆటో డ్రైవర్ అతనికి సహాయం చేశాడు. ఆ ఆటో డ్రైవర్ సన్నీని తన ఆటోలో కూర్చోబెట్టాడు.
సన్నీ డియోల్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోకి నెటిజన్ల నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. ‘సన్నీ డియోల్ తాగి ఎందుకు తిరుగుతున్నాడు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరు ‘బహుశా ఇది డీప్‌ఫేక్ వీడియో కావచ్చు’ అని కామెంట్ చేశారు. ‘బాబీ సక్సెస్ అయ్యాడు కాబట్టి సన్నీ షాక్ అయ్యుంటాడు’ అంటూ నెటిజన్లు వ్యంగ్యగా కామెంట్స్ చేస్తున్నారు.
సన్నీ డియోల్ ఈ వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సన్నీ తన రాబోయే చిత్రం ‘సఫర్’ షూటింగ్ వివిధ నగరాల్లో జరుపుకుంటుంది. ఐతే ఈ వీడియో ఆ మూవీ షూటింగ్ సమయంలోనే అని తెలుస్తోంది. సన్నీ తాను మద్యం తాగనని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో స్పష్టం చేశాడు.
ఆ ఇంటర్వ్యూలో సన్నీ మాట్లాడుతూ, “నేను మద్యం సేవించనని కాదు. నేను ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు సమాజంలో భాగమని నేను తాగాను. ఒక విషయం ఏమిటంటే, అది చాలా చేదుగా ఉంటుంది. ఇది చాలా దుర్వాసనతో ఉంటుంది, ఇది తాగిన తర్వాత తలనొప్పి కూడా వస్తుంది, కానీ ప్రజలు దీన్ని ఎందుకు ఇష్టపడతారో అర్థం కాలేదు. అందుకే నేనెప్పుడూ మద్యపానాన్ని ఇష్టపడలేదు అని చెప్పాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.