టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది.. జీవితంలో చాలా విషయాలను వెనక్కి తిరిగి చూసుకునేలా చేసిందని సందీప్ ట్వీట్ చేశాడు. తనకు సంతోషాన్ని ఇచ్చే అంశాల గురించి ఆలోచించేలా చేసిందని అన్నాడు. తన జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఎక్కువకాలం దాచుకోలేను. సోమవారం మీతో ఓ విషయాన్ని పంచుకోబోతున్నాను అని సందీప్ కిషన్ ట్విట్టర్లో వెల్లడించాడు. ట్వీట్‌కు జతగా మ్యాన్ ఇన్ లవ్ స్టిక్కర్‌ను జత చేశాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. సందీప్ కూడా త్వరలో మ్యారేజ్ చేసుకోనున్నాడని భావిస్తున్నారు. ఆ విషయాన్నే వెల్లడిస్తాడని చెబుతున్నారు.
2020 has had me revisiting a lot of things about my life & got me thinking on what makes me Happy..
Gave me the time & courage to take the next Big Step in my Life…??
Probably also the most exciting…??
Can’t wait to share the news ?
Monday it is ❤️ pic.twitter.com/CwbYLcMSH4— Sundeep Kishan (@sundeepkishan) August 14, 2020
Also Read : తోటి కోడళ్ల పంచాయితీ : ఏపీ, తమిళనాడులోని రెండు గ్రామాల వివాదమైంది