ప్రస్తుతం హారర్ కామెడీ చిత్రం ‘స్త్రీ 2’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా వసూళ్ల రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన రాజ్‌కుమార్‌రావు, శ్రద్ధా కపూర్‌ల నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. తమ ప్రతిభతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుల్లో రాజ్‌కుమార్‌రావు ఒకరు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో తన నటనతో అందరినీ మెప్పించాడు. రాజ్‌కుమార్ రావు ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న స్థితికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డారు. సామాన్య కుర్రాడిగా కెరీర్ ప్రారంభించిన రాజ్ కుమార్ రావు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఇటీవలఓ ఇంటర్వ్యూలో తన కష్టాల రోజుల గురించి చెప్పుకొచ్చింది. కెరీర్ తొలినాళ్లలో తన ఖాతాలో కేవలం 18 రూపాయలు మాత్రమే ఉండేవి అని చెప్పాడు. ముంబై లాంటి నగరంలో ఇంత డబ్బుతో జీవించడం చాలా కష్టం.. ముఖ్యంగా తినడానికి.. ఉండేందుకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆకలేస్తే పార్లేజీ బిస్కెట్స్ తిని ఫ్రూటీ తాగుతూ ఉండేవాడినని చెప్పుకొచ్చాడు.
ఒక ఇంటర్వ్యూలో, తాను 2008లో ముంబైకి వెళ్లానని, అయితే 2010లో తన మొదటి సినిమా రిలీజ్ అయ్యాక కూడా తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. బ్యాంకు ఖాతాలో రూ.18, అతని స్నేహితుడి ఖాతాలో రూ.21 మాత్రమే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో అతని స్నేహితులతోపాటు రాజ్ కుమార్ రావు కూడా ఒక్క పూట భోజనం చేసేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. తన ఫస్ట్ మూవీకి ముందు తాను వందల సంఖ్యలో ఆడిషన్స్ ఇచ్చానని, మొదటి సినిమా వచ్చిన తర్వాత కూడా దాదాపు నెల రోజుల పాటు దానికి కేవలం రూ.11,000 మాత్రమే ఫీజుగా ఇచ్చారని రాజ్‌కుమార్ తెలిపారు. దీని తర్వాత, అతను తన తదుపరి చిత్రం ‘రాగిణి MMS కోసం కూడా మంచి రెమ్యునరేషన్ తీసుకున్న విలాసవంతమైన జీవితాన్ని గడపడం లేదని చెప్పాడు.
రాజ్‌కుమార్ రావు హర్యానాలోని గురుగ్రామ్‌లో జన్మించారు. అతని తండ్రి సత్య ప్రకాష్ యాదవ్ హర్యానా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. తల్లి కమలేష్ యాదవ్ గృహిణి. అతను పాఠశాలలో ఉన్నప్పుడు, కొన్ని కారణాల వల్ల తన కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా మారిందని, ఫీజు చెల్లించడానికి కూడా తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. ఆ సమయంలో, అతని రెండు సంవత్సరాల ఫీజు అతని ఉపాధ్యాయులలో ఒకరు చెల్లించారు. కానీ ప్రస్తుతం రాజ్ కుమార్ రావు నికర విలువ రూ.81 కోట్లు. ముంబైలో ఆయనకు సొంత ఇల్లు కూడా ఉంది. అలాగే ఒక సినిమాకు 5-6 కోట్లు వసూలు చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.