శ్రేయా ఘోషల్ భారతదేశపు టాప్ సింగర్. ఆమె గురించి తెలియని వారు ఉండరు. శ్రేయా ఘోషల్ దాదాపు అన్ని భారతీయ భాషల్లో పాడి అలరించారు. మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ స్టార్ సింగర్. వేలాది మంది శ్రోతలు అతని లైవ్ కాన్సర్ట్ కు హాజరవుతారు. శ్రేయా ఘోషన్ గానం ఆమె ఎనర్జీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అయితే ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శ్రేయా ఘోషల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ షోలో శ్రేయ ఎమోషనల్ అయ్యారు. ఆమెను చూసి ఆడియన్స్ కూడా ఎమోషల్ అయ్యారు. కాగా తన పాటకు చప్పట్లు కొట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు శ్రేయా ఘోషల్.
కొన్ని నెలల క్రితం కోల్‌కతాలోని ఆర్కే మెడికల్ కాలేజీ యువతి అత్యాచారం, హత్య ఘటన దేశ విదేశాల్లో వార్తల్లో నిలిచింది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు పశ్చిమ బెంగాల్‌లో వైద్యులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ నిరసనకు గాయని శ్రేయా ఘోషల్ కూడా మద్దతు పలికారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో శ్రేయా ఘోషల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రేయా ఘోషల్ మరణించిన వైద్య విద్యార్థిని కోసం ఓ భావోద్వేగ గీతాన్ని ఆలపించారు.
మరణించిన విద్యార్థి కోసం శ్రేయా ఘోషల్ బెంగాలీ పాట ‘ఈ జీ సోరియర్, చిట్కార్’ పాడారు. ఈ పాట అర్థం ‘ఈ రోజు మీరు ఈ శరీరం యొక్క ఏడుపు విన్నారు’. పాట పాడే ముందు ప్రేక్షకులతో మాట్లాడిన శ్రేయా ఘోషల్.. ఈ పాటకు ఎవరూ చప్పట్లు కొట్టవద్దని, ఈ పాటను అర్థం చేసుకుని మరణించిన విద్యార్థిని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోండి అని తెలిపింది. అదేవిధంగా శ్రేయా ఘోషల్ కార్యక్రమంలోనూ ‘వి వాంట్ జస్టిస్’ అనే నినాదాలు మారుమ్రోగాయి. ఈ నినాదాలకు శ్రేయ కూడా మద్దతు పలికింది. కాగా ఆర్కే రేప్ కేసు జరిగినప్పుడు శ్రేయా ఘోషల్ తన లైవ్ కాన్సర్ట్‌ను రద్దు చేసుకుంది. ఆ తర్వాత కూడా కేసుపై తన వ్యతిరేకతను తెలిపేందుకు కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. శ్రేయా ఘోషల్ మళ్లీ షో చేసినప్పటికీ, ఆమె తన నిరసనను ఇలా తెలిపింది. శ్రేయా ఘోషల్ కంటే ముందు అరిజిత్ సింగ్ కూడా కోల్‌కతాలో ఒక ప్రదర్శన ఇచ్చాడు. ఈ ఘటనను ఆయన కూడా తీవ్రంగా ఖండించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.