Sri Vishnu: దూసుకుపోతున్న యంగ్ హీరో శ్రీవిష్ణు.. అర్జున ఫల్గుణ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్…

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల రాజ రాజా చోర సినిమాతో హిట్ అందుకున్నాడు

Sri Vishnu: దూసుకుపోతున్న యంగ్ హీరో శ్రీవిష్ణు.. అర్జున ఫల్గుణ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్...

Updated on: Oct 15, 2021 | 3:55 PM

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల రాజ రాజా చోర సినిమాతో హిట్ అందుకున్నాడు శ్రీవిష్ణు.. విడుదలైన మొదటి రోజునే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, శ్రీవిష్ణు ఫాంలోకి వచ్చేలా చేసింది ఈ మూవీ.. ఇక ఆ తరువాత శ్రీవిష్ణుతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలుగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక శ్రీవిష్ణు నుంచి రావడానికి ‘భళా తందనాన’ సినిమా సిద్ధమవుతోంది. ఇదే కాకుండా.. శ్రీవిష్ణు మరో ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశాడు.. శ్రీవిష్ణు నటిస్తున్న అర్జున ఫల్గుణ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి్ తేజ మర్నీ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్… అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ‘విజయదశమి’ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్… ఈ పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఇందులో హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది. తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన ఆమె, ‘రెడ్’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమై, ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే ‘అర్జున ఫల్గుణ’ విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రయూనిట్…

ట్వీట్..

Also Read:

Adavaallu meeku johaarlu: రష్మిక ముందు తెగ సిగ్గపడిపోతున్న శర్వా.. ఆడవాళ్లు మీకు జోహర్లు నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..

IPL 2021 FINAL: ఫైనల్లో రికార్డుల వర్షం.. ధోని సరసన చేరేందుకు రాయుడి ఆరాటం.. 13 ఏళ్ల రికార్డుపై గైక్వాడ్ కన్ను.. లిస్టులో బ్రావో కూడా..!