Sreeleela: ‘గుంటూరు కారం ఘాటు.. మూవీకి శ్రీలీల స్వీటు’.. బ్యూటీ డైహార్డ్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా ?..

|

Jan 13, 2024 | 3:38 PM

పెళ్లి సందడి మూవీతో కథానాయికగా వెండితెరకు పరిచయమై..ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో బ్యూటీ యాక్టింగ్, డాన్స్ పర్ఫార్మెన్స్‏తో ఆకట్టుకుంది. ఈ సినిమా మొత్తానికి మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల డాన్స్ హైలెట్. దీంతో టాలీవుడ్ లో శ్రీలీలకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఓకే ఏడాదిలో ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. గతేడాది మొత్తం శ్రీలీల నామసంవ్తత్సరంగానే గడిచింది

Sreeleela: గుంటూరు కారం ఘాటు.. మూవీకి శ్రీలీల స్వీటు.. బ్యూటీ డైహార్డ్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా ?..
Sreeleela
Follow us on

తెలుగు సినీ పరిశ్రమలో అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి మూవీతో కథానాయికగా వెండితెరకు పరిచయమై..ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో బ్యూటీ యాక్టింగ్, డాన్స్ పర్ఫార్మెన్స్‏తో ఆకట్టుకుంది. ఈ సినిమా మొత్తానికి మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల డాన్స్ హైలెట్. దీంతో టాలీవుడ్ లో శ్రీలీలకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఓకే ఏడాదిలో ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. గతేడాది మొత్తం శ్రీలీల నామసంవ్తత్సరంగానే గడిచింది. ఇక ఈ సంక్రాంతికి కూడా థియేటర్లలో గుంటూరు కారం సినిమాతో సందడి చేస్తుంది. ఇందులో శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఇక ఎప్పటిలాగే ఈ మూవీలో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది శ్రీలీల.

ఇదిలా ఉంటే..ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సీజన్ లో గుంటూరు కారం సందడి కొనసాగుతుంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే సినిమా విడుదలకు ముందే థియేటర్ల వద్ద త్రివిక్రమ్, మహేష్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. ఇటు హైదరాబాద్‏లోని పలు థియేటరల్లో మహేష్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం శ్రీలీల స్పెషల్ కటౌట్ పోస్టర్స్ వైరలవుతుంది. సాధారణంగా సినిమా రిలీజ్ అంటే థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి చెప్పక్కర్లేదు. ఊరంతా బ్యానర్స్, కటౌట్స్, పాలాభిషేకాలు చేస్తూ నానా రచ్చ చేస్తుంటారు. అయితే కేవలం స్టార్ హీరోల కటౌట్స్ మాత్రమే కాదు.. హీరోయిన్స్ కటౌట్స్ కూడా చూశాం.

గతంలో సమంత, నయనతార, అనుష్క భారీ కటౌట్స్ పెట్టారు. ఇక ఇప్పుడు శ్రీలీలకు సైతం బ్యానర్స్ పెట్టారు ఫ్యాన్స్. గుంటూరు కారం విడుదల సందర్భంగా ఓ ఊర్లో శ్రీలీల ఫోటోలతో పెద్ద బ్యానర్ వేయించారు. ఆ పోస్టర్ లో శ్రీలీల ఫోటోలతోపాటు.. తమ ఫోటోలను కూడా జత చేశారు. “గుంటూరు కారం ఘాటు.. మూవీకి శ్రీలీల స్వీటు.. అందుకే నువ్వు నా హార్ట్..” అని కొటేషన్ కూడా రాశారు. ఇవే కాదు.. శ్రీలీల డై హార్డ్ ఫ్యాన్స్ అని రాయించారు. ఇక బ్యానర్ పై మహేష్ ఫోటోను కూడా వేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.