South Directors: హీరోల రేంజ్‌ను దాటేస్తున్న డైరెక్టర్స్.. సౌత్ సినిమాలో నయా ట్రెండ్

|

Jul 25, 2022 | 7:18 PM

బాహుబలికి ముందు వరకు మామూలు కమర్షియల్ డైరెక్టర్‌గానే ఉన్న జక్కన్న ఇమేజ్‌... ఆ తరువాత మరో లెవల్‌కు చేరింది. బాహుబలి సక్సెస్‌తో ఇండియన్ సినిమాకు కేరాఫ్‌గా మారారు రాజమౌళి.

South Directors: హీరోల రేంజ్‌ను దాటేస్తున్న డైరెక్టర్స్.. సౌత్ సినిమాలో నయా ట్రెండ్
Top Directors
Follow us on

సినిమా అంటే హీరో సెంట్రిక్‌ మీడియం. తెర వెనుక ఎంత మంది కష్టపడినా… క్రేజ్ అంతా తెర మీద కనిపించే హీరోకే. ఇదంతా పాత లెక్క… ఇప్పుడు హీరోలకు పోటిగా ఇమేజ్‌ బిల్డ్ చేసుకుంటున్నారు డైరెక్టర్స్‌. అంతేకాదు కొన్నిసార్లు హీరోలను పక్కకు నెట్టి సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ను క్యాప్చర్‌ చేసేస్తున్నారు. ఈ జనరేషన్‌లో హీరోల ఇమేజ్‌ను దాటి క్రేజ్‌ సొంతం చేసుకున్న దర్శకుడు రాజమౌళి(SS Rajamouli). బాహుబలి(Bahubali)కి ముందు వరకు మామూలు కమర్షియల్ డైరెక్టర్‌గానే ఉన్న జక్కన్న ఇమేజ్‌… ఆ తరువాత మరో లెవల్‌కు చేరింది. బాహుబలి సక్సెస్‌తో ఇండియన్ సినిమాకు కేరాఫ్‌గా మారారు రాజమౌళి. బాహుబలి తరువాత ట్రిపులార్(RRR) తో మరో సెన్సేషనల్ హిట్ ఇచ్చారు రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌(JR Ntr), రామ్ చరణ్‌(Ram Charan) లాంటి ఇద్దరు సూపర్ స్టార్‌లు తెర మీద కనిపించిన… నేషనల్‌ మీడియా కూడా రాజమౌళి గురించే స్పెషల్‌గా మాట్లాడింది. ఓవర్‌సీస్‌లో అయితే ట్రిపులార్‌… రాజమౌళి సినిమాగానే ప్రమోట్‌ అయ్యింది.

ప్రభాస్‌ లాంటి భారీ కటౌట్‌ ఉన్నా… ఎన్టీఆర్ లాంటి మాస్‌ స్టార్‌ ఉన్నా…. రామ్ చరణ్ లాంటి మెగా ఇమేజ్‌ ఉన్నా… ఇది రాజమౌళి సినిమా అన్న మార్క్‌ మాత్రం కాపాడుకుంటూనే ఉన్నారు జక్కన్న. రాజమౌళి రికార్డ్ తరువాత దర్శకులుగా తమ మార్క్ చూపిస్తున్న వారి నెంబర్ భారీగా పెరుగుతోంది. రీసెంట్‌ టైమ్స్‌లో ఇది పలానా డైరెక్ట్ సినిమా అని మాట్లాడుకుంటున్న సందర్భంగా తరుచూ వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు కన్నడ స్టార్ హీరో యష్‌. అయితే ఈ సినిమా యష్‌ కెరీర్‌కు ఎంత వరకు ఉపయోగపడిందో కానీ… డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌కు మాత్రం పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది. కేజీఎఫ్ తరువాత ప్రశాంత్ కాంబినేషన్‌లో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు టాప్ హీరోలు.

లేటెస్ట్‌గా లోకేష్ కనగరాజ్ కూడా ఈ లిస్ట్‌లోకి చేరారు. కమల్‌ హాసన్ హీరోగా విక్రమ్ సినిమాను తెరకెక్కించారు లోకేష్‌. లోకనాయకుడికి మోస్ట్ అవెయిటెడ్‌ హిట్ ఇచ్చిన ఈ యంగ్ డైరెక్టర్‌… ఒక్కసారిగా నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మోస్ట్ వాంటెడ్‌ డైరెక్టర్‌గా మారారు లోకేష్‌ కనగరాజ్‌. ఈ రేంజ్‌ను ఎప్పటి నుంచో మెయిన్‌టైన్ చేస్తున్నారు కోలీవుడ్ లెజెండ్స్‌ మణిరత్నం, శంకర్‌. ఈ ఇద్దరు దర్శకులు ఏ సినిమా చేసినా.. అందులో ఎంత పెద్ద స్టార్స్‌ నటించినా… అది డైరెక్టర్స్ మూవీగానే ప్రొజెక్ట్ అవుతూ వస్తోంది. ప్రజెంట్ రామ్‌ చరణ్‌తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు శంకర్‌. మణిరత్నం.. పొన్నియిన్‌ సెల్వన్‌ను బిగ్గెస్ట్ ఎవర్‌ మల్టీ స్టారర్‌గా రూపొందిస్తున్నారు ఈ రెండు సినిమాల విషయంలో దర్శకుల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..