SonuSood: కరోనా కష్ట సమయంలో ఉపాధి కోల్పోయిన ఎంతో వలస కూలీలకు అండగా నిలిచి కలియుగ కర్ణుడిగా పేరు సంపాదించుకున్నారు నటుడు సోనూ సూద్. సినిమాల్లో విలన్ పాత్రలో కనిపించిన సోనూసూద్ రియల్ లైఫ్‌లో మాత్రం హీరోగా మారారు. ఎంతో మందికి సహాయాన్ని అందిస్తూ జననీరాజనాలను పొందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అడిగింది లేదంటూ ఆర్థికంగా సహాయాన్ని అందిస్తున్నారు.
ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది ఆక్సిజన్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు వేశారు సోనూ. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసేందుకు పూనుకున్న సోనూ.. ఇందులో భాగంగా తొలి ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నెల్లూరు కలెక్టర్ కోరిక మేరకు అక్కడ కూడా ఓ ఆక్సిజన్ ప్లాంట్‌ను వచ్చే నెలలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో తమ ప్రాంతంతో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకుగాను అక్కడి ప్రజలు సోనూసూద్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కరోనా కష్ట సమయంలో ఎంతో మందికి ఎనలేని సేవలందిస్తోన్న సోనూకు సిద్ధిపేట జిల్లాకు చెందిన కొందరు గ్రామస్తులు ఏకంగా గుడి కట్టి పూజలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఓవైపు సోనూసూద్ ప్రజలకు చేస్తోన్న సేవకు గుర్తుగా ఆయన అభిమానులు చేస్తోన్న పాలాభిషేకాలపై సోనూసూద్ స్పందించారు. తనపై చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఒక మంచి సందేశం ఇచ్చారు. ఇలా పాలాభిషేకాలతో పాలను వృథా చేయకుండా.. అవసరంలో ఉన్న వారికి అందించండి అంటూ ట్వీట్ చేశారు.
Humbled ❣️
Request everyone to save milk for someone needy.? https://t.co/aTGTfdD4lp— sonu sood (@SonuSood) May 24, 2021
Also Read: Minister Avanti Srinivas: రాజకీయ లబ్ధికోసమే లోకేష్ పరామర్శలు.. లోకేశ్‌పై మంత్రి అవంతి విమర్శలు
Malaika Arora : చట్టపట్టాలేసుకు తిరగడం వరకు సరే.. ఇప్పటికైనా ఈ ప్రేమ జంట పెళ్లిపై స్పందిస్తారా..