Sonu Sood: ఏమీ చేయలేకపోతున్నాను..పరిస్థితి దారుణంగా ఉంది..దీనికి ఎవరినీ నిందించవద్దు అంటున్న సోనూసూద్!

|

Apr 17, 2021 | 4:14 PM

గత ఏడాది లాక్‌డౌన్ సందర్భంగా వేలాది మంది వలస కూలీలను తమ స్వస్థాలాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేయడం ద్వారా మెస్సీయగా మారిన నటుడు సోను సూద్. ఈ ఏడాది కోవిడ్ రోగులకు పడకలు, మందులు అందించలేకపోవడంపై నిస్సహాయత వ్యక్తం చేశారు.

Sonu Sood: ఏమీ చేయలేకపోతున్నాను..పరిస్థితి దారుణంగా ఉంది..దీనికి ఎవరినీ నిందించవద్దు అంటున్న సోనూసూద్!
Sonu Sood
Follow us on

Sonu Sood: గత ఏడాది లాక్‌డౌన్ సందర్భంగా వేలాది మంది వలస కూలీలను తమ స్వస్థాలాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేయడం ద్వారా మెస్సీయగా మారిన నటుడు సోను సూద్. ఈ ఏడాది కోవిడ్ రోగులకు పడకలు, మందులు అందించలేకపోవడంపై నిస్సహాయత వ్యక్తం చేశారు. శుక్రవారం, ఆయన తన ట్విట్టర్ లో ఈ విషయంపై స్పందిస్తూ “నేను ఉదయం నుండి నా ఫోన్‌ ఖాళీగా లేదు. ఆసుపత్రులు, పడకలు, మందులు, ఇంజెక్షన్ల కోసం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కాల్స్ వచ్చాయి. అయితే, ఇప్పటి వరకు నేను ఏవిధంగానూ వాటిని అందించలేకపోయాను.” అని పోస్ట్ చేశారు. అంతేకాకుండా ”చాలా మంది నిస్సహాయంగా భావిస్తున్నారు. పరిస్థితి భయానకంగా ఉంది. దయచేసి ఇంట్లోనే ఉండండి, మాస్క్ ధరించండి.. కరోనా సంక్రమణ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.” అంటూ చెప్పారు.

ఈ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలలోనే మరో పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితికి ఎవరినీ నిందించవద్దు అంటూ ఆ ట్వీట్ లో ఆయన కోరారు. “నేను చెప్పినట్లు చేయండి. నేను ఇంకా చేస్తున్నాను. మనం కలిసి మరెన్నో ప్రాణాలను రక్షించగలమని నాకు నమ్మకం ఉంది. ఇది ఎవరినీ నిందించాల్సిన సమయం కాదు, మీరు అవసరమైన వారికి వైద్య అవసరాలను తీర్చడానికి ప్రయత్నించండి. కలిసి జీవితాలను కాపాడుకుందాం. నేను మీ కోసం ఎల్లప్పుడూ ఉంటాను.” అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇటీవల, సోను సూద్ తన సోషల్ మీడియాలో ఇండోర్‌లోని నిరుపేదలకు తాను రెమెడెసివర్ అదేవిదంగా 10 ఆక్సిజన్ సిలిండర్లను పంపినట్లు చెప్పారు. ఇది కాకుండా కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నుండి ఆఫ్‌లైన్ పరీక్షలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీని తరువాత, సిబిఎస్ఇ 10 వ పరీక్షను రద్దు చేసి, 12 వ పరీక్షను వాయిదా వేసినప్పుడు సోను సంతోషం వ్యక్తం చేశారు.

సోనూ సూద్ చేసిన వరుస ట్వీట్స్..

Also Read: Tamil actor Vivek: కమెడియన్ వివేక్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని..

Indian Railways: భారత రైల్వే సంచలన నిర్ణయం.. ప్రయాణంలో కూడా మాస్క్‌ ధరించాల్సిందే.. లేకపోతే..