సోనియా అగర్వాల్.. ఈ బ్యూటీ గుర్తుందా.. 7/జి బృందావన్ కాలనీ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది. నిజానికి ఈ సినిమా కంటే ముందు పలు తెలుగు సినిమాల్లో నటించింది సోనియా అగర్వాల్. వినీత్, అబ్బాస్ కలిసి నటించిన నీ ప్రేమకై అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ భామ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత జగపతి బాబుతో కలిసి ధమ్ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఆ తరువాత 2004లో వచ్చిన 7/జి బృందావన్ కాలనీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కింది. ఆ తర్వాత తెలుగులోకి డబ్ అయ్యింది.
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో సోనియా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా తర్వాత ఆమె పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.
ఇక ఆ సినిమా దర్శకుడు సెల్వ రాఘవన్ నే ఆమె వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ ఇద్దరూ విడిపోయారు కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె 40 పదుల వయసులోకి అడుగుపెట్టింది. అయినా కూడా ఏమాత్రం తగ్గని గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సోనియా.. తాజాగా తన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూస్తే ఈ