
సోనాలి బిద్రె.. ఈ అమ్మడి గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఆగ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సోనాలి బిద్రె.

హిందీ, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఆతర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. 2004లో వచ్చిన మెగాస్టార్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాతర్వాత తెలుగులో నటించ లేదు.

ఆతర్వాత సోనాలి క్యాన్సర్ బారిన పడింది.. ఎంతో దైర్యంగా ఆమె క్యాన్సర్ ను జయించింది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉంది సోనాలి.

సినిమాలకు బ్రేక్ తీసుకున్న సోనాలి.. సోషల్ మీడియా ద్వార అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది సోనాలి.