Sobhan Babu: ఘనంగా శోభన్ బాబు జయంతి వేడుకలు.. నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఫ్యాన్స్

|

Jan 16, 2024 | 7:24 PM

ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి అన్నం ప్యాకెట్లను పలువురికి పంపిణీ చేశారు. మహిళలు ఆదరించే నటుడు శోభన్ బాబు జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం సంతోషంగా ఉందని డిప్యూటీ మేయర్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సేవా సమితి కమిటీ సభ్యులు..

Sobhan Babu: ఘనంగా శోభన్ బాబు జయంతి వేడుకలు.. నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఫ్యాన్స్
Sobhan Babu
Follow us on

సినీ నటుడు దివంగత శోభన్ బాబు జయంతి వేడుకలను శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ అధ్యక్షులు పద్మారావు, ప్రధాన కార్యదర్శి బి. లాల్ బహుదూర్ శాస్త్రి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్మెస్సార్ వర్మ ఆధ్వర్యంలో తార్నాక చౌరస్తాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, బి.ఆర్.ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు శ్రీ మోతె శోభన్ రెడ్డి గారు, శోభన్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి అన్నం ప్యాకెట్లను పలువురికి పంపిణీ చేశారు. మహిళలు ఆదరించే నటుడు శోభన్ బాబు జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం సంతోషంగా ఉందని డిప్యూటీ మేయర్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సేవా సమితి కమిటీ సభ్యులు అలాగే శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.