Sid Sriram: హీరోగా మారనున్న సింగర్ ?.. ఆ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో సిద్ శ్రీరామ్ మూవీ?..

|

Jan 10, 2022 | 8:49 AM

సినీ రంగంలో సిద్ శ్రీరామ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలి కాలంలో సిద్ శ్రీరామ్ పాట లేని సినిమా

Sid Sriram: హీరోగా మారనున్న సింగర్ ?.. ఆ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో సిద్ శ్రీరామ్ మూవీ?..
Follow us on

సినీ రంగంలో సిద్ శ్రీరామ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలి కాలంలో సిద్ శ్రీరామ్ పాట లేని సినిమా లేదు. ఈ యువ గాయకుడి తన గాత్రంతో ఎంతోమందిని మంత్రముగ్దులను చేశాడు. సిద్ శ్రీరామ్ పాడిన పాట ఓ సెన్సెషన్. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ దక్కించుకుంటూ ఆయా చిత్రాలకు కావాల్సినంత ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. సినిమా విడుదల కాకముందే సిద్ శ్రీరామ్ తన పాట ద్వారా మూవీ పై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. చిన్న,పెద్ద సినిమా అనే తేడా లేకుండా మేకర్స్ సిద్ శ్రీరామ్ పాట ఉండాల్సిందే అన్నట్టుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన సిద్ శ్రీరామ్ కు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు యంగ్ సింగర్ మరో కొత్త అవతారంలో కనిపించబోతున్నాడట. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో సిద్ శ్రీరామ్ గాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా మారనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాని.. స్క్రీప్ట్ నచ్చడంతో హీరోగా నటించేందుకు సిద్ శ్రీరామ్ ఒప్పుకున్నాడని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

Bangarraju: జ‌న‌వ‌రి 14.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజు.. నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..

Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన అర్జున్ క‌పూర్..