
దక్షిణాదిలో వేలాది పాటలు పాడిన గాయని ఎస్ జానకి అంత్యక్రియలు ముగిశాయి. మైసూరులోని ఆమె ఫామ్ హౌస్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య జానకమ్మ అంత్యక్రియల కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని రేపల్లెలోని పల్లెపట్ల గ్రామంలో జన్మించిన ఆమె.. తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పెరిగారు. జానకమ్మ మృతితో సినీరంగంలో విషాద చాయలు అలుముకున్నాయి. సినీరంగంలోని తరాలు, సింగర్స్, అభిమానులు స్వయంగా హాజరై నివాళులర్పించారు. 3 సంవత్సరాల వయస్సులో సంగీతం నేర్చుకోవడం ప్రారంభించి, 9 సంవత్సరాల వయస్సులో వేదికపై పాడటం మొదలుపెట్టారు. ఆమె 1957లో ఇండస్ట్రీలో తన పాటల ప్రయాణం స్టార్ట్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.
20 భాషలలో సుమారు 50 వేల పాటలు పాడిన ఏకైక గాయని ఎస్. జానకి. ఆమె 4 జాతీయ అవార్డులు ,30కి పైగా రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. తమిళంలో, ఆమె ’16 వయతినిలే’ సినిమాలోని ‘సెంతురప్ పూవే’ పాటకు , ‘తేవర్మగన్’ సినిమాలోని ‘ఇంజి ఇడుప్పళగి’ పాటకు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. అయితే జనవరిలో గుండెపోటుతో తన కుమారుడు మురళీ కృష్ణ మరణించడంతో ఆమె మానసికంగా కుంగిపోయారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..
గత రెండు సంవత్సరాలుగా మైసూరులో నివసిస్తున్న జానకమ్మ, గానానికి స్వస్తి చెప్పి ఆధ్యాత్మికతపై దృష్టి సారించారు. ఆమె మైసూరులోని వివిధ దేవాలయాలను తరచుగా సందర్శించేవారు. ఆమె నంజన్‌గూడ్‌లోని నంజుండేశ్వరర్, చాముండేశ్వరి ,యోగనరసింహస్వామి దేవాలయాలతో సహా పలు ప్రదేశాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. అయితే దశాబ్దాల సినీ ప్రయాణంలో జానకమ్మ కోట్లు సంపాదించినా ఎప్పుడూ సాదారణ జీవితం గడపడానికే ఇష్టపడ్డారు. తాజా సమాచారం ప్రకారం ఆమె ఆస్తులు రూ.537 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.
ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..