
మైక్రో ఫైనాన్స్ కేసు, గంటకో ట్విస్ట్.. పూటకో మలుపు తిరుగుతోంది. సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో మధు అండ్ గ్యాంగ్ కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో నిందితులుగా ఉన్న రమావత్ మధు, బాలాజీనాయక్, భరత్ చౌహాన్‌పై నల్గొండ, గద్వాల్‌లో 62 కేసులు నమోదయ్యాయి. ఆ 62 కేసులను సీఐడీకి బదాలయించారు అధికారులు. ఆ ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం సీఐడీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో రమావత్ మధు వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
పరోక్షంగా మంగ్లీని వెనకేసుకొచ్చిన రమావత్ మధు.. హిమాకాంత్ రెడ్డి తనను మోసం చేశాడని చెప్పుకొచ్చాడు. కంపెనీలో పెట్టిన కోట్ల రూపాయలు అతని దగ్గరే ఉన్నాయన్నాడు. అంతేకాకుండా అడ్వొకేట్ సుబ్బారావు చెప్పేవన్నీ వాస్తవాలు కావన్నారు రమావత్ మధు. దీని పై మంగ్లీ అడ్వకేట్ స్పందిస్తూ.. హిమాకాంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కోటిన్నర స్కాం ను డైవర్ట్ చేయడానికి హిమాకాంత్ రెడ్డి మంగ్లీ పేరు వాడుతున్నాడని అన్నారు. స్కాం చేసిన అమౌంట్ అంతా హిమాకాంత్ రెడ్డి దగ్గరే ఉందని, బాధితుడిగా చెప్పుకుంటూ హిమాకాంత్ రెడ్డి అన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు.
కాగా తన పై వస్తున్న ఆరోపణల డిజిపి కి ఫిర్యాదు చేశారు సింగర్ మంగ్లీ. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేశారు ఆమె.. డీజీ అందుబాటులో లేకపోవడం తో అడిషనల్ డీజి మహేష్ భగవత్ కు ఫిర్యాదు చేశారు. సింగర్ మంగ్లీ దీని గురించి మాట్లాడుతూ.. చాలా నలిగిపోతున్న.. విచారణ చేసుకోండి. పాటలు తప్ప.. స్కాం లు తెలియవు నాకు. నేను తప్పు చేసి ఉంటే.. ఎలాంటి శిక్షకైనా రెడీ.. పేదరికం నుంచి వచ్చాను. డబ్బు విలువ నాకు తెలుసు. నెల రోజులుగా నా ప్రోగ్రామ్ లు, రికార్డింగ్స్ వదులుకున్నా.. ప్రజల్లోకి తప్పుగా వెళ్తోంది. బాధితులకు నేను అండగా ఉంటా.. మధు నాయక్, హిమాకాంత్ రెడ్డి, రామావత్ మధు, సిద్ధు, సుబ్బారావు పై డీజీపీ కి ఫిర్యాదు చేసాను అని తెలిపారు మంగ్లీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.