Chinmayi Sripada: ఆ హక్కు నీకుంది.. ఎవరి పెత్తనం అవసరం లేదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..

|

Nov 03, 2021 | 3:00 PM

సింగర్ చిన్మయి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. సింగర్.. డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా సినీ పరిశ్రమలో

Chinmayi Sripada: ఆ హక్కు నీకుంది.. ఎవరి పెత్తనం అవసరం లేదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..
Chinmayi
Follow us on

సింగర్ చిన్మయి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. సింగర్.. డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది చిన్మయి. అంతేకాదు… ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కోంటున్న వేధింపులపై బహిరంగంగా పోరాడింది.. అలాగే.. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు.. వివక్షతలపై ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తుంటుంది. ఇక తల్లిదండ్రులకు చెప్పుకోలేని బాధలను… చిన్మయితో చెప్పుకున్నవారికి అవసరమైన సలహాలు ఇస్తూ.. వారికి ధైర్యం కల్పిస్తుంటుంది. ఇటీవల అమ్మాయిలు పెళ్లి తర్వాత ఉద్యోగం చేయవచ్చా ? అనే అంశంపై తన స్టైల్లో వివరణ ఇచ్చింది చిన్మయి..

తాజాగా సింగర్ చిన్మయి … తన ఇన్‏స్టాలో షాకింగ్ పోస్ట్ చేసింది.. ఓ అమ్మాయి తన సమస్యను చిన్మయితో చెప్పుకుంది. తల్లిదండ్రులకు తామిద్దరం ఆడపిల్లలమని.. అబ్బాయిలు లేరని తెలిపింది. ఇక ఇటీవల తనకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని.. కట్నంగా డబ్బుమాత్రమే కావాలని.. ఆస్తి రాసిస్తాను.. డబ్బు ఇవ్వలేమని చెబితే కుదరదు అంటున్నారని… అలాగే రెండు సంవత్సరాల పాటు తన తల్లిదండ్రుల కోసం తను పని చేసి.. ఆ జీతం మొత్తాన్ని తన పేరెంట్స్‏కు ఇస్తానని చెప్పిందట. అందుకు ఆ అబ్బాయి తల్లి ఒప్పుకోలేదట.. అలా ఎలా చేస్తావ్.. నువ్వ ఆ డబ్బులు మాకు ఇవ్వాల్సిందే అని చెప్పింది..

ఇక ఈ అమ్మాయికి పోస్ట్ పై చిన్మయి సీరియస్ కామెంట్స్ చేసింది. ఎవరికి ఎవరి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఎవరి కష్టార్జితం వారిదేనని తీవ్ర స్థాయిలో కోప్పడింది. మీ నాన్న ఎంతో కష్టపడి సంపాందించిన సొమ్మును ఎవ్వరకీ రాసివ్వాల్సిన పనిలేదు.. అబ్బాయి వాళ్లు కట్నాన్ని డిమాంట్ చేయకూడదు. నువ్ మీ తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకునే హక్కు ఉంది. ఈ డబ్బును ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకునే హక్కు నీకుంది. మీ అత్తగారి పెత్తనం అవసరం లేదు.. నీ డబ్బు తింటూ బతకాల్సిన అవసరం వారికి లేదు అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది చిన్మయి. పెళ్లి అంటే ఆర్థిక లావాదేవీల్లాగే మారిపోయాయని.. ఎవరో ఒకరు నష్టపోవడం.. మరోకరు లాభపడడం జరుగుతుంది. ఆడవారు.. మగవారి కుటుంబాన్ని పెంపొందించడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. ఆడవారికి అలా అవసరం లేదు.. అలాంటప్పుడు అబ్బాయికి పెళ్లి చేయాల్సి అవసరం లేదు. పెళ్లి కోసం అంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. ఎవరి కష్టార్జితం వారిది..డబ్బు కావాలంటే సంపాదించుకోండి అని చెప్పుకొచ్చింది చిన్మయి.

Also Read: Puneeth Raj Kumar: రాబంధులను మించిపోయారు.. పునీత్ హఠాన్మరణాన్ని బిజినెస్‌కు వాడుకుంటున్న ఆసుపత్రులు..

Ravi teja: టైగర్‌ నాగేశ్వరరావుగా మాస్‌ మహారాజా.. పాన్‌ ఇండియాలో రవితేజ కొత్త సినిమా..

ట్రెండీ లెహాంగాలో మెరిసిన బుల్లితెర నాగిని.. అందాల మౌని రాయ్ అదిరిపోయే ఫోటోస్..