అభిమాన హీరోకు పెళ్లి కావాలని ఫ్యాన్స్ వింత మొక్కుబడులు

|

Oct 04, 2020 | 5:34 PM

తమిళ తంబీలు అభిమానం ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుంటారు. సినిమా హీరో, హీరోయిన్లు..రాజకీయ నాయకులను వారు ఒక్కసారి అభిమానించడం ప్రారంభించడం స్టార్ట్ చేస్తే, ఇక కట్టె కాలే వరకు ఆ అభిమానాన్ని చూపిస్తూనే ఉంటారు.

అభిమాన హీరోకు పెళ్లి కావాలని ఫ్యాన్స్ వింత మొక్కుబడులు
Follow us on

తమిళ తంబీలు అభిమానం ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుంటారు. సినిమా హీరో, హీరోయిన్లు..రాజకీయ నాయకులను వారు ఒక్కసారి అభిమానించడం ప్రారంభించడం స్టార్ట్ చేస్తే, ఇక కట్టె కాలే వరకు ఆ అభిమానాన్ని చూపిస్తూనే ఉంటారు. అక్కడి నాయకులు, హీరోలు కూడా ఫ్యాన్స్‌కు అంతే దగ్గరిగా ఉంటారు. హీరోయిన్లపై అభిమానాన్ని కాస్త ఎక్కువగా చాటుకునే తమిళ జనం, వారికి ఏకంగా గుడి కట్టిన సందర్బాలు ఉన్నాయి. తాజాగా అక్కడ కొత్త సాంప్రదాయం తెరపైకి వచ్చింది. ( చిక్కిపోయిన కీర్తి, షాకవుతోన్న ఫ్యాన్స్ )

తమ అభిమాన నటుడుకి పెళ్లి జరగాలని అభిమానులు వింత మొక్కుబడులు చెల్లిస్తున్నారు. విభిన్న చిత్రాలతో హీరో శింబు తమిళ సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అతను వెంటవెంటనే సినిమాలు చేయడం లేదు. కాగా ఇటీవల శింబు పెళ్లి వార్తలు కూడా జోరందుకున్నాయి కానీ అతని పేరెంట్స్ వాటన్నింటినీ వదంతులుగా కొట్టిపారేశారు. ఈ క్రమంలో తమ అభిమాన హీరో శింబుకి త్వరగా పెళ్లి కావాలని తమిళనాడులోని ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాణిపేట జిల్లా రత్నగిరి ఆలయంలో శింబుకి వివాహం జరగాలని మోకాళ్ల మీద రత్నగిరి గిరి కొండ ఎక్కి తమ మొక్కుబడి చెల్లించుకున్నారు అభిమానులు. (విజయవాడలో ప్రజల ప్రాణాలతో మటన్ మాఫియా చెలగాటం )