Tillu Square: అమెరికాలో టిల్లుగాడి సెన్సెషన్.. రికార్డ్స్ సృష్టిస్తోన్న ‘టిల్లు స్క్వేర్’..

వారం రోజుల్లోనే రూ. 96 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక మరో నాలుగైదు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోనే చేరనుంది.ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టిల్లు స్క్వేర్ సక్సె్స్ మీట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

Tillu Square: అమెరికాలో టిల్లుగాడి సెన్సెషన్.. రికార్డ్స్ సృష్టిస్తోన్న టిల్లు స్క్వేర్..
Tillu Square

Updated on: Apr 07, 2024 | 8:20 AM

ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు చేరువలో దూసుకుపోతుంది టిల్లు స్క్వేర్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ సంచలనం సృష్టిస్తోంది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ తొలిసారి గ్లామర్ రోల్ పోషించింది. గతంలో రిలీజ్ అయిన డీజే టిల్లు మ్యాజిక్‏ను ఇప్పుడు టిల్లు స్క్వేర్ మోత మోగిస్తున్నాడు. వారం రోజుల్లోనే రూ. 96 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక మరో నాలుగైదు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోనే చేరనుంది.ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టిల్లు స్క్వేర్ సక్సె్స్ మీట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలోనూ రికార్డ్స్ సృష్టిస్తుంది టిల్లు స్క్వేర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుని ఇప్పుడు రూ. 100 కోట్ల గ్రాస్ టచ్ చేసేందుకు రెడీ అయ్యింది. అలాగే యూఎస్ మార్కెట్ లో సైతం టిల్లు హవా మాములుగా లేదు. అమెరికాలో ఇప్పటివరకు రెండున్న మిలియన్ డాలర్స్ గ్రాస్ రాబట్టింది. ఇక మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా సెన్సెషనల్ మార్క్ 3 మిలియన్ క్లబ్ లో జాయిన్ కావడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటివరకు అమెరికాలో 3 మిలియన్ డాలర్స్ రాబట్టిన హీరోగా సిద్ధూ నిలవనున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలోనూ వసూళ్లు కొల్లగొడుతున్న టిల్లు స్క్వేర్ దూకుడు మరికొన్ని రోజులు ఉండడం ఖాయం.

టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ, సిద్దూ జంటగా నటించగా.. డీజే టిల్లు చిత్రంలో కనిపించిన నేహా శెట్టి మరోసారి ఈ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఇక ఎప్పటిలాగే మరోసారి తనదైన డైలాగ్ డెలివరీతో నాన్ స్టాప్ నవ్వులు పూయించాడు సిద్ధూ. త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్ టిల్లు క్యూబ్ ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మించగా.. మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి ఇందులో కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.