ఇటీవల థియేటర్లలో కడుపుబ్బా నవ్వించిన సినిమా టిల్లు స్క్వేర్. గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా రూపొందించిన సినిమా ఇది. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీని డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించారు.. ట్రైలర్, సాంగ్స్, టీజర్‌తోనే క్యూరియాసిటిని పెంచేసిన మేకర్స్.. భారీ అంచనాల మధ్య టిల్లు స్వ్కే్ర్ సినిమాను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. మార్చి 29న విడుదలైన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే దాదాపు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో సిద్ధూ. తనదైన డైలాగ్ డెలివరీ, మ్యానరిజంతో మరోసారి థియేటర్లలో జనాలను అలరించాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ ప్రియుల నిరీక్షణకు తెర దించారు మేకర్స్. టిల్లు స్క్వే్ర్ ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాను ఈనెలలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈచిత్రాన్ని ఏప్రిల్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాను అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. “చరిత్ర పునరావృతం కావడం సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లుతోని.. టిల్లు స్క్వేర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 26న వస్తుంది” అంటూ రాసుకొచ్చింది. ఇక ఎట్టకేలకు టిల్లు స్క్వేర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రావడంతో మూవీ లవర్స్ ఖుషీ అవుతున్నారు.
టిల్లు స్క్వేర్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఫస్ట్ పార్టులో నేహా శెట్టి కథానాయికగా నటించగా.. సెకండ్ పార్టులో అనుపమ పరమేశ్వరన్ సందడి చేసింది. ఇక టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు మూడో భాగం టిల్లు క్యూబ్ తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది.
History repeat avvadam normal. Adhe Tillu vasthe History, mystery, chemistry anni repeat avvuthai. Atluntadhi Tilluthoni. ✨🥰
Tillu Square arrives on 26 April, on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi. pic.twitter.com/SwEzFgJujb— Netflix India South (@Netflix_INSouth) April 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.