Project K: ‘ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా విషయంలో నేను అదే చేశాను’.. ఆసక్తికర విషయాలు చెప్పిన డైరెక్టర్..

|

Sep 07, 2022 | 8:21 PM

ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, దీపికా పదుకొణే కీలకపాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా విషయంలో నేను అదే చేశాను.. ఆసక్తికర విషయాలు చెప్పిన డైరెక్టర్..
Project K
Follow us on

పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్ గత కొద్దిరోజులుగా బిజీ బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా కంప్లీట్ చేసిన ప్రభాస్… ప్రస్తుతం సలార్, ప్రాజెక్ కె సినిమాల చిత్రీకరణలలో పాల్గొంటున్నారు. అందులో కేజీఎప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ చేస్తున్న సలార్ ఒకటి. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా..ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, దీపికా పదుకొణే కీలకపాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు. కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా..నిర్మాతగా.. నటుడిగా.. గాయకుడిగా.. మ్యూజిక్ డైరెక్టర్ గా చేసి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన సింగీతం.. గత కొద్ది రోజులుగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల అలీతో సరదగా షోకు విచ్చేసిన ఆయన తన కెరీర్, లైఫ్ గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే అలీ మాట్లాడుతూ.. ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కె చిత్రానికి అశ్వినదత్ మిమ్మల్ని మెంటర్ గా ఉండాలని చెప్పారట ? అని అడగ్గా.. సింగీతం శ్రీనివాస రావు స్పందిస్తూ.. స్క్రిప్ట్ వరకు మాత్రమే మార్పులు.. చేర్పులు చేసి ఇచ్చాను. మెంటర్ గా లేదు అంటూ చెప్పుకొచ్చారు.