Singeetam Srinivasa rao: లెజండరీ డైరెక్టర్ ఇంట విషాదం.. సింగీతం శ్రీనివాస రావుకు సతీ వియోగం..

గత కొద్ది రోజులుగా అనారోగ్యం సమస్యలతో ఇబ్బందిపడుతున్న లక్ష్మీ కళ్యాణి శనివారం రాత్రి చెన్నైలో మృతి చెందారు.

Singeetam Srinivasa rao: లెజండరీ డైరెక్టర్ ఇంట విషాదం.. సింగీతం శ్రీనివాస రావుకు సతీ వియోగం..
Singeetham Srinivasa Rao

Updated on: May 29, 2022 | 12:04 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావుకు (Singeetham Srinivasa Rao) సతీ వియోగం కలిగింది. ఆయన భార్య లక్ష్మీ కళ్యాణి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యం సమస్యలతో ఇబ్బందిపడుతున్న లక్ష్మీ కళ్యాణి శనివారం రాత్రి చెన్నైలో మృతి చెందారు. ఈ విషయాన్ని సింగీతం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ” నా భార్య లక్ష్మీ కళ్యాణి శనివారం రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచింది. 62 ఏళ్ల సుధీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది ” అంటూ తన భార్య మరణాన్ని ప్రకటించారు.

1960లో సింగీతం శ్రీనివాస రావు.. లక్ష్మీ కళ్యాణిల వివాహం జరిగింది. సింగీతం సీని కెరీర్ లో లక్ష్మీ కళ్యాణి కీలకపాత్ర పోషించారు. సినిమా స్క్రిప్ట్ రచనలో ఆమె ఆయనకు సాయంగా నిలిచారు.. ఈ కారణంగానే సింగీతం తన భార్య గురించి శ్రీ కళ్యాణీయం అనే ఓ పుస్తకాన్ని రాశారు. గత కొద్ది రోజులుగా సింగీతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కే చిత్రానికి కన్సల్టెంట్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి