
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు దర్శకుడు సాగర్. సూపర్ స్టార్ కృష్ణలాంటి బడా హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు సాగర్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు దర్శకుడు సాగర్. కాగా ఓ ఇంటర్వ్యూలో సాగర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. నటి ఇంద్రజ, నటుడు సుమన్, సీనియర్ నటులైన రావు గోపాల్ రావు, అల్లు రామలింగయ్య వంటి వారి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సాగర్. ముఖ్యంగా హీరోయిన్ ఇంద్రజ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాను దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మదొంగ సినిమా ద్వారా ఇంద్రజాకు కెరీర్ పరంగా కీలక మలుపు ఇచ్చానని దర్శకుడు సాగర్ తెలిపారు. అయితే, జగదేక వీరుడు అనే రెండో సినిమా షూటింగ్ సమయంలో ఇంద్రజ ప్రవర్తన వివాదాస్పదంగా మారిందని ఆయన అన్నారు.
మైసూరులో షూటింగ్ కోసం యూనిట్ అంతా ప్రయాణ ఏర్పాట్లు చేస్తుండగా, ఇంద్రజ ట్రైన్‌లో వస్తే వాంతులు అవుతాయని, కాబట్టి తాను ఫ్లైట్ లో వస్తానని చెప్పిందట. అప్పట్లో స్టార్ నటి కే.ఆర్. విజయలాంటి వారు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ట్రైన్ లో వచ్చారట.. కానీ ఇంద్రజ మాత్రం తనకు ట్రైన్ జర్నీ పడదు వాంతులు అవుతాయి అని చెప్పారట.. ఆమె ప్రవర్తన సాగర్‌కు నచ్చలేదన్నారు. ఆమెకు బుద్ధి చెప్పే ఉద్దేశంతో, వారం రోజుల పాటు షూటింగ్ సెట్‌లో ఇంద్రజతో ఎవరూ మాట్లాడకూడదని డైరెక్టర్ సాగర్ చెప్పారట. ఎవరైనా మాట్లాడితే వాంతులు చేసుకుంటుందని సరదాగా చెప్పారట. దీంతో ఇంద్రజ తీవ్ర మనస్తాపానికి గురై ఏడ్చిందని, క్షమాపణలు కూడా చెప్పిందని సాగర్ తెలిపారు. ఆ తర్వాత ఆమెను తన సినిమాలలో తీసుకోలేదని సాగర్ స్పష్టం చేశారు.
అలాగే హీరో సుమన్ కెరీర్‌ను ప్రభావితం చేసిన బ్లూఫిల్మ్ ఆరోపణల గురించి కూడా సాగర్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని, మీడియాలో వచ్చిన వార్తలు తప్పు అని పేర్కొన్నారు. నిజానికి, సుమన్‌పై నమోదైన కేసు కేవలం పబ్లిక్ న్యూసెన్స్కు సంబంధించింది మాత్రమేనని, బ్లూఫిల్మ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని సాగర్ స్పష్టం చేశారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల చిరంజీవి వంటి సన్నిహితులు కూడా తీవ్రంగా బాధపడ్డారని సాగర్ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..