అందరూ అనుకుంటుంది కాదు.. నా భర్త సూసైడ్ చేసుకోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన జయసుధ

తన సహజమైన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి జయసుధ. తెలుగు సినిమాల్లో అమ్మ పాత్ర అంటే టక్కున గుర్తుకువచ్చే పేరు ఆమెది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఎంతో మంది స్టార్ హీరోలకు అమ్మగా నటించి ఆకట్టుకున్నారు. ఎలాంటి హావభావాలనైనా అలవోకగా పలికించగల నటి ఆమె..

అందరూ అనుకుంటుంది కాదు.. నా భర్త సూసైడ్ చేసుకోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన జయసుధ
Jayasudha

Updated on: Mar 13, 2026 | 12:06 PM

సీనియర్ హీరోయిన్ జయసుధ.. రెండు తెలుగు రాష్ట్రల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజనటిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జయసుధ. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి తదితర దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించారు జయసుధ. తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ అందాల తార ఇప్పుడు సహాయ నటిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. అయితే గతంలో కంటే ఆమె చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు జయసుధ. సోషల్ మీడియాలోనూ ఎక్కడా కనిపించడం లేదు. అయితే అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. కాగా గతంలో జయసుధ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

నటి జయసుధ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని వ్యక్తిగత సంఘటనలు, ముఖ్యంగా తన భర్త నితిన్ మరణం, దాని చుట్టూ అలుముకున్న పుకార్లు, సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె నితిన్ మరణానికి దారితీసిన పరిస్థితులు, తన వ్యక్తిగత పోరాటాలు, సోషల్ మీడియా విమర్శలపై స్పష్టతనిచ్చారు జయసుధ. నితిన్ మరణం వెనుక అప్పులు కారణమనే ప్రచారాన్ని జయసుధ ఖండించారు. తమ కుటుంబంలో దీర్ఘకాలంగా వస్తున్న కర్స్ (శాపం)గా ఆమె అభివర్ణించిన డిప్రెషన్ సమస్యే దీనికి ప్రధాన కారణమని వివరించారు.

జయసుధ భర్త నితిన్ సోదరుడు, అలాగే వారి అత్తగారి తరఫున మరో ఇద్దరు మహిళలు కూడా ఇలాంటి పరిస్థితిలోనే మరణించినట్లు ఆమె పేర్కొన్నారు. ఒక డిప్రెషన్ లేదా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు దానిని ఎదుర్కోలేకపోయేవారని, ఈ బలహీనత కుటుంబంలో ఉన్నదని ఆమె తెలిపారు. తాను డబ్బు సంపాదించే వ్యక్తిని కాబట్టి నితిన్ మరణానికి ఆర్థిక సమస్యలు కారణం కాదని, అప్పులంటే తనకు భయం లేదని స్పష్టం చేశారు జయసుధ. “అప్పుల కోసం ఆత్మహత్య చేసుకునేంత అప్పులు ఎప్పుడూ ఉండేవి కావు” అని ఆమె అన్నారు. సినిమా నిర్మాణాల వల్ల నష్టాలు వచ్చాయని జయసుధ, తాను నితిన్ కోసం సినిమాలు తీశానని, అవి పెద్ద నష్టాలకు దారితీయలేదని అన్నారు. మూడు సినిమాలు బాగా ఆడితే, మూడు సినిమాలు పోయాయని వివరించారు. బయట అనుకునే విధంగా అవి మేజర్ అప్పులు కావని, సాధారణంగా అందరూ ఎదుర్కొనే చిన్నపాటి ఆర్థిక సమస్యలని అన్నారు. అలాగే సోషల్ మీడియాలో కొందరు నితిన్ మరణంపై, తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేసేవారిని ఆమె విమర్శించారు. “ఒకరిని బాధపెడితే, అది నిజం కానప్పుడు అది తిరిగి వారికి వస్తుంది” అని అన్నారు. నితిన్ మరణం తర్వాత ఆమె కోలుకోవడానికి సమయం పట్టిందని, అయితే కుటుంబ సభ్యులు, కౌన్సెలింగ్ సహాయంతో బయటపడ్డానని తెలిపారు. దిల్‌రాజు సినిమా శతమానం భవతి షూటింగ్ తనకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చిందని, ఆ సమయంలో దిల్‌రాజు కూడా తన భార్యను కోల్పోయి అదే పరిస్థితిని ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us