Sarath Babu: శరత్ బాబు ఆరోగ్యం ఆందోళనకరం.. వెంటిలేటర్ పై చికిత్స..

ఆయన శరీరం మొత్తం సెప్సిస్ కావడంతో ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలపై పడినట్లుగా ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్ చెప్పినట్లుగా సమాచారం.

Sarath Babu: శరత్ బాబు ఆరోగ్యం ఆందోళనకరం.. వెంటిలేటర్ పై చికిత్స..
Sarath Babu

Updated on: Apr 23, 2023 | 1:16 PM

టాలీవుడు నటుడు శరత్ బాబు (71) ఆరోగ్యం ఆందోలనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు.. సన్నిహితులు ఈనెల 20న హైదరాబాద్‏లో ఏఐజీలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన శరీరం మొత్తం సెప్సిస్ కావడంతో ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలపై పడినట్లుగా ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్ చెప్పినట్లుగా సమాచారం.

ఈరోజు సాయంత్రం మరోసారి శరత్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని సన్నిహితుల నుంచి తెలుస్తోంది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు శరత్ బాబు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 220రి పైగా చిత్రాల్లో కనిపించారు. హీరోగా ఆయన తొలి చిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. తర్వాత కన్నెవయసు సినిమాలో నటించారు. కేవలం హీరోగానే కాకుండా అనేక చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించారు.