సూపర్ స్టార్ అంటే ప్రాణం.. జైలర్ 2 థియేటర్ మొత్తం బుక్ చేసిన టీమిండియా ప్లేయర్

సాధారణంగా సినీ తారలకు, క్రికెటర్లకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. కానీ సెలబ్రిటీలు సైతం తమకు ఇష్టమైన నటీనటుల పట్ల అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ క్రికెటర్ రజనీకాంత్‌పై ఉన్న అభిమానం చాటుకున్నాడు. జైలర్ 2 కోసం ఏకంగా ఓ థియేటర్ ను బుక్ చేసుకున్నాడు.

సూపర్ స్టార్ అంటే ప్రాణం.. జైలర్ 2 థియేటర్ మొత్తం బుక్ చేసిన టీమిండియా ప్లేయర్
Jailer 2

Updated on: Oct 20, 2026 | 10:48 AM

సినిమా హీరోలపై అభిమానాన్ని చాటుకోవడంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ వెనక్కి తగ్గరు. ముఖ్యంగా తమ అభిమాన నటుడు సూపర్‌స్టార్‌ అయితే ఆ క్రేజ్‌ మరో స్థాయిలో ఉంటుంది. తాజాగా టీమిండియా క్రికెటర్‌ సంజు శాంసన్‌ తన అభిమాన నటుడు రజనీకాంత్‌పై ఉన్న ప్రేమను చాటుకుంటూ వార్తల్లో నిలిచాడు. తలైవా నటించిన ‘జైలర్ 2’ సినిమా చూసేందుకు ఏకంగా థియేటర్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకున్నట్లు సంజు వెల్లడించిన విషయం ఆసక్తికరంగా మారింది. టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌కు క్రికెట్‌తో పాటు సినిమాలంటే కూడా ఎంతో ఇష్టం. ముఖ్యంగా తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అంటే అతడికి ప్రత్యేకమైన అభిమానం. తలైవా కొత్త సినిమా విడుదలవుతుందంటే వీలైనంత త్వరగా చూసేందుకు సంజు ప్రయత్నిస్తుంటాడట. అయితే ఈసారి కొన్ని కారణాల వల్ల జైలర్ 2 చిత్రాన్ని విడుదలైన రోజే చూడలేకపోయాడు.

బాబోయ్.. ఈ చిన్నది బయట ఎలా ఉందో చూశారా..! స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే

డిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి రావడంతో సినిమా చూసే అవకాశం కోల్పోయినట్లు సంజు తెలిపాడు. అయినప్పటికీ తన అభిమాన నటుడి సినిమాను చూసేందుకు మరుసటి రోజు ప్రత్యేకంగా సమయం కేటాయించాడు. అంతేకాదు, తన భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా వీక్షించేందుకు ఏకంగా థియేటర్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకున్నట్లు వెల్లడించాడు. రజనీకాంత్‌ సినిమాల కోసం తాను ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తానని సంజు చెప్పుకొచ్చాడు. ఆయన తదుపరి సినిమా ఏంటి.? ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై తనకు ఎంతో ఆసక్తి ఉంటుందని వివరించాడు. సాధ్యమైనంత వరకు రజనీకాంత్‌ చిత్రాలను విడుదలైన మొదటి రోజే చూడాలని ప్రయత్నిస్తానని తెలిపాడు.

రజినీకాంత్‌కు జోడీగా 27 ఏళ్ల హీరోయిన్.. భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా

ఈసారి మాత్రం ఢిల్లీలో  కార్యక్రమం కారణంగా ‘జైలర్ 2’ సినిమాను ఒక రోజు ఆలస్యంగా చూడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. అయితే థియేటర్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నాడు. బిగ్‌స్క్రీన్‌పై తన అభిమాన నటుడు రజనీకాంత్‌ను చూసి ఎంతో సంతోషించినట్లు వెల్లడించాడు. ఈ సినిమా చూసేందుకు సంజు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు అతడి టీమ్ లోని తమిళం తెలిసిన సహాయక సిబ్బంది కూడా వచ్చినట్లు తెలిపాడు. దీంతో తన అభిమాన నటుడి సినిమాను అందరితో కలిసి ఆస్వాదించే అవకాశం దక్కిందని సంజు ఆనందం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు చాలా ఇష్టం: సూపర్ స్టార్ కృష్ణ

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us