సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ ఇచ్చేస్తాం.. సంగీత్ శోభన్ క్రేజీ కామెంట్స్

మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ (లడ్డు).. ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు.

సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ ఇచ్చేస్తాం.. సంగీత్ శోభన్ క్రేజీ కామెంట్స్
Sangeeth Shobhan

Updated on: Mar 01, 2025 | 8:37 AM

‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ను అనౌన్స్ చేశారు మేకర్స్. మ్యాడ్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. విడుదల తర్వాత మ్యాడ్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఆకట్టుకుంది. ఇక మ్యాడ్ స్క్వేర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి టీజర్ విడుదలైంది.

విడుదలైన నిమిషాల్లోనే ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇప్పటికే 10 మిలియన్ దాటి దూసుకుపోతుంది మ్యాడ్ స్క్వేర్ టీజర్. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. “మ్యాడ్ సినిమాను మీరందరూ చూసి ఎంజాయ్ చేశారు. ‘మ్యాడ్ స్క్వేర్’ అయితే దానికి పది రెట్లు ఉంటుంది. ప్రతి సీనూ మిమ్మల్ని నవ్విస్తుంది. మార్చి 29న విడుదలవుతున్న మా సినిమాని చూసి ఆదరించండి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే నమ్మకం ఉంది.” అన్నారు

అలాగే సంగీత్ శోభన్ మాట్లాడుతూ, “మీరు టీజర్ లో చూసింది చాలా తక్కువ. సినిమాలో అంతకుమించిన వినోదం ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ పై అంచనాలు, ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. మ్యాడ్ సినిమా సమయంలో నిర్మాత వంశీ గారు ఒక మాట చెప్పారు.. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని. ఇప్పుడు ఆయన మాటగా నేను చెప్తున్నా.. ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ ఇచ్చేస్తాం (నవ్వుతూ). మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం.” అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.