క్రేజీ న్యూస్ ..మెగాస్టార్ చిరంజీవితో అర్జున్ రెడ్డి డైరెక్టర్.. స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో సందీప్ రెడ్డి

టాలీవుడ్ లో ఒక్క సినిమా తోనే ఓవర్ నైట్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యారు సందీప్ వంగ.. అర్జున్ రెడ్డి సినిమా తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు సందీప్.

క్రేజీ న్యూస్ ..మెగాస్టార్ చిరంజీవితో అర్జున్ రెడ్డి డైరెక్టర్.. స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో సందీప్ రెడ్డి

Edited By: Rajitha Chanti

Updated on: Apr 26, 2021 | 9:21 AM

Sandeep Vanga: టాలీవుడ్ లో ఒక్క సినిమా తోనే ఓవర్ నైట్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యారు సందీప్ వంగ.. అర్జున్ రెడ్డి సినిమా తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు సందీప్.  విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన  సంగతి తెలిసిందే. దీని తర్వాత ఓ క్రైమ్ డ్రామాతో కూడిన సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. రణ్ బీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాను అనౌన్స్ చేసాడు సందీప్ వంగ.

ఇక మంచి కంటెంట్ ఉంటే సౌత్ సినిమాలు హిందీలో కూడా బాగా ఆడతాయి అని బాహుబలి, కెజిఎఫ్ లాంటి చిత్రాలు ప్రూవ్ చేశాయని కబీర్ సింగ్ సినిమాతో నిరూపించాడు సందీప్ రెడ్డి . గతంలో ఈ యంగ్ డైరెక్టర్.. మహేష్ బాబును కలిసి కథ చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై సరైన క్లారిటీ లేదు. తాజాగా సందీప్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లోనే కథాచర్చలు సాగనున్నాయట. స్క్రిప్టుతో మెప్పిస్తే ఈ సినిమా ఫైనల్ అయినట్టేనన్న టాక్ కూడా వినిపిస్తోంది. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న చిరు ఇప్పుడు  సందీప్ రెడ్డితో స్క్రిప్టును ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

నేనే నంబర్ వన్ అంటున్న నటసింహం బాలకృష్ణ.. రికార్డులు క్రియేట్ చేస్తున్న బాలయ్య వీడియో..:Akhanda Teaser video.

RRR: ఆర్ఆర్ఆర్ లో అందమైన ప్రేమకావ్యం.. ఇద్దరు భామలతో ఎన్టీఆర్ ప్రేమాయణం

pawan kalyan: అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లోమార్పులు.. పవన్ కోసం ఆ సీన్స్ యాడ్ చేస్తున్నారట..