Martin Luther King: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ ఆయిన సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్

|

Nov 22, 2023 | 7:06 PM

విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సంపూర్ణేష్ బాబు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు సంపూర్ణేష్ బాబు. ఇటీవలే మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సంపూర్ణేష్ బాబు. పొలిటికల్ సెటైరికల్ మూవీగా తెరకెక్కింది మార్టిన్ లూథర్ కింగ్. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Martin Luther King: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ ఆయిన సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్
Martin Luther King
Follow us on

ఇప్పటికే ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొత్త సినిమాలు నెల రోజుల వ్యవధిలో ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఆ సినిమానే సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే మార్టిన్ లూథర్ కింగ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ కానుందని టాక్.

విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సంపూర్ణేష్ బాబు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు సంపూర్ణేష్ బాబు. ఇటీవలే మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సంపూర్ణేష్ బాబు. పొలిటికల్ సెటైరికల్ మూవీగా తెరకెక్కింది మార్టిన్ లూథర్ కింగ్. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అక్టోబర్ 27, 2023న సినిమా థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ. ఇక ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది.

థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది మార్టిన్ లూథర్ కింగ్. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది మార్టిన్ లూథర్ కింగ్. నవంబర్ 29 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.