Samantha New Movie: ఆరేళ్ళ ప్రేమ.. నాలుగేళ్ళ వివాహ బంధం.. వెరసి మొత్తం పదేళ్ల జీవిత ప్రయాణానికి విడాకులతో చెక్ పెట్టారు చై సామ్ జంట. గత కొన్ని రోజులుగా చై-సామ్ విడాకుల వార్తలే ట్రేడింగ్ లో ఉన్నాయంటే.. ఎంతగా వీరిద్దరినీ అభిమానులు ఇష్టపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వివాహ బంధానికి విడాకులతో గుడ్ బై చెప్పిన అక్కినేని నాగ చైతన్య, సమంతలు ఇప్పుడు తమ కెరీర్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైతు.. థాంక్యూ మూవీ షూటింగ్ తో బిజీగా ఉండగా తాజాగా సమంత దసరా కానుకగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.
‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత తాజాగా దసరా రోజున తన నెక్స్ట్ సినిమాను ప్రకటించింది. డ్రీం వారియర్స్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇది తెలుగు, తమిళంలో ద్వి భాష చిత్రంగా తెరకెక్కనుంది. ఇది లేడీ ఓరియెంటెడ్ కథ అని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వబోతోంది. దీంతో పాటు మరో సినిమాని కూడా అనౌన్స్ చేసింది.
Happy to have @Samanthaprabhu2 onboard for our next Bilingual film!! #Production#30 #Tamil #Telugu @DreamWarriorpic written & directed by @Shantharuban87 pic.twitter.com/x4OwEI9HPL
— SR Prabhu (@prabhu_sr) October 15, 2021
శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థలో హరి, హరీష్ దర్శకత్వంలో మరో సినిమాని ప్రకటించింది సమంత. ఈ సినిమా నవంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు సమాచారం. ఈ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ అని సమాచారం. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ అయిన సమంత ఫ్యామిలీ మాన్ సిరీస్ తో నార్త్ లో కూడా బాగా పేరు తెచ్చుకుంది.