ఆ భ‌యం త‌న‌కెంతో మేలు చేస్తోందంటున్న స‌మంత‌

|

Aug 15, 2020 | 3:45 PM

ఏ పాత్ర వేసినా ప్రాణం పోసే న‌టి స‌మంత‌. ప్ర‌స్తుతం విభిన్న క‌థా చిత్రాల్లో న‌టిస్తోన్న ఆమె, ఫిల్మ్ కెరీర్​లో వదులుకోలేకపోయిన భయాల గురించి ఇంట్ర‌స్టింగ్ విషయాలు చెప్పింది.

ఆ భ‌యం త‌న‌కెంతో మేలు చేస్తోందంటున్న స‌మంత‌
Follow us on

ఏ పాత్ర వేసినా ప్రాణం పోసే న‌టి స‌మంత‌. ప్ర‌స్తుతం విభిన్న క‌థా చిత్రాల్లో న‌టిస్తోన్న ఆమె, ఫిల్మ్ కెరీర్​లో వదులుకోలేకపోయిన భయాల గురించి ఇంట్ర‌స్టింగ్ విషయాలు చెప్పింది.

అప్పుడప్పుడూ కొన్ని భయాలు త‌న‌లోని నటిని మరింత మెరుగుపెడుతుంటాయ‌ని చెప్పింది స‌మంత‌. ఈ ముద్దుగుమ్మ‌ త్వరలో ఓటీటీలోనూ అలరించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే ఇచ్చిన ఆన్​లైన్​ ఇంటర్వ్యూలో ‘నటిగా ఇన్నేళ్ల ప్ర‌స్థానంలో వీడ‌ని భయాలు ఏమైనా ఉన్నాయా?’ అని అడగ్గా.. ఉన్నాయని ఆన్స‌ర్ ఇచ్చింది. ఆ భ‌య‌మంటే తనకెంతో ఇష్టమని కూడా చెప్పింది.

“నేను భయాన్ని ఇష్టపడటానికి స్పెష‌ల్ రీజ‌న్ ఉంది. ప్రస్తుతం నేను సవాల్‌తో కూడిన పాత్రలు చేసేందుకు ఇంట్ర‌స్ట్‌తో ఎదురుచూస్తున్నా. అలాంటి రోల్ నా దగ్గరకొచ్చినప్పుడు.. ‘నేను చేయగలనా? లేదా?’ అన్న భయం నాలో ఉండాలి అనుకుంటా. ఎందుకంటే ఆ భయం ఉన్నప్పుడే ఇంకా శ్ర‌ద్ద‌గా, మరింత జాగ్రత్తగా ఆ రోల్ పోషిస్తా. ఈ మధ్య నా నుంచి మంచి మూవీస్, చక్కటి రోల్స్ వస్తున్నాయంటే కారణం ఈ భయమే” అని చెప్పుకొచ్చింది అక్కినేనివారి కోడ‌లు.

Also Read  : కరోనా టీకాపై ప్రధాని మోదీ స్ప‌ష్ట‌త‌