Samantha: నయనతార దారిలో సామ్‌…కొత్త సినిమాలకు కొత్త కండిషన్లు!!

|

Oct 18, 2021 | 6:08 PM

చైతూతో విడాకుల అనంతరం వీలైనన్నీ ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది సమంత.

Samantha: నయనతార దారిలో సామ్‌...కొత్త సినిమాలకు కొత్త కండిషన్లు!!
Samantha 1
Follow us on

చైతూతో విడాకుల అనంతరం వీలైనన్నీ ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది సమంత. తద్వారా ప్రొఫెషనల్ కెరీర్లో బిజీగా ఉంటూ పర్సనల్ లైఫ్ లోని సమస్యలను అధిగమించాలనుకుంటోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’, ‘కాత్తు వాక్కుల రెండు కాదల్(తమిళం)’ అనే సినిమాల్లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా డ్రీమ్ వారియర్ తెరకెక్కిస్తోన్న ఓ చిత్రానికి పచ్చజెండా ఊపింది. దసరా రోజున దీనిపై అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. చైతన్యతో విడాకుల వ్యవహారంలో కొందరి నుంచి విమర్శలు ఎదుర్కొన్న సామ్…తన సినిమాలపై వీటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది. ఇందులో భాగంగా తన కొత్త ప్రాజెక్టుల టేకప్ విషయంలో కొత్త కొత్త కండిషన్లు పెడుతోందట. వీలైనంత వరకు చెన్నై ఇండోర్ ప్రదేశాల్లోనే షూటింగ్ చేయాలని, హైదరాబాద్ లో అయితే ఇండోర్ షూట్స్ పెట్టమని దర్శక నిర్మాతలను కోరుతోందట.

అందుకే ఈ నిబంధనలు!
చైతూతో విడిపోయాక హైదరాబాద్ లో షూటింగ్ చేయడానికి సామ్ ఎక్కువగా ఆసక్తి చూపట్లేదని, మరికొంత కాలం చెన్నైలోనే ఉండాలనుకుంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఈ ముద్దుగుమ్మ కొత్త నిబంధనలు విధిస్తోందట. ఇటీవల శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్‌ తన కొత్త సినిమా కోసం సమంతను సంప్రదించారట. అయితే సినిమా సైన్‌ చేయడానికి ముందే తన కండిషన్స్‌ను నిర్మాత ముందు పెట్టిందట సామ్‌. అదేవిధంగా తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న మరో చిత్రానికి సుమారు రూ.3 కోట్లు అడిగిందట. హరి, హరీశ్‌లు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో మొదలు కానుంది. ఈ క్రమంలో సమంత క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శక నిర్మాతలు కూడా ఆమె విధిస్తోన్న కండిషన్లకు ఓకే చెబుతున్నారట. ఇదే సమయంలో సామ్‌ పెడుతోన్న కొత్త నిబంధనలు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారను గుర్తుచేస్తున్నాయని సినీ వర్గాలు గుప్పుమంటున్నాయి. నయనతార సినిమా ప్రమోషన్లు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Read Also: ముంబై నుంచి నేపాల్ చేరిన డ్రగ్స్ పార్టీ కేసు.. మరో ఇద్దరు స్మగ్లర్లను విచారిస్తున్న అధికారులు

సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?

య్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..