వారెవ్వా.. శిల్పాశెట్టి జోరు పెంచిందిగా..! కొత్త హెయిర్‌ స్టైల్‌.. వర్కౌట్స్‌ అదరిపోలా..

Shilpa Shetty: బాలీవుడ్ వెటరన్ బ్యూటీ శిల్పాశెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ యోగా, వర్కౌట్స్‌కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో

వారెవ్వా.. శిల్పాశెట్టి జోరు పెంచిందిగా..! కొత్త హెయిర్‌ స్టైల్‌.. వర్కౌట్స్‌ అదరిపోలా..
Shilpa Shetty
Follow us
uppula Raju

|

Updated on: Oct 18, 2021 | 4:36 PM

Shilpa Shetty: బాలీవుడ్ వెటరన్ బ్యూటీ శిల్పాశెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ యోగా, వర్కౌట్స్‌కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అయితే ఇటీవల ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన శిల్పాశెట్టి భర్తను విడిపించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంది. ఎట్టకేలకు రాజ్‌కుంద్రా బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ ఇప్పుడు సాధారణ స్థితిలోకి వచ్చింది.

తాజాగా ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో సరికొత్త అవతారంలో దర్శనమిచ్చింది. హెయిర్‌ స్టైల్‌ మొత్తం మార్చేసింది. వెనకాల జుట్టుని చిన్నగా ట్రిమ్‌ చేసింది. బూడిద రంగు టాప్‌, ట్రాక్‌ ధరించి వర్కౌట్స్‌ చేసింది. ‘జీవితంలో రిస్క్‌ తీసుకుంటేనే ఏదైనా సాధించవచ్చు. కంఫర్ట్ జోన్‌ నుంచి బయటక వచ్చి జీవించడం నేర్చుకోండి’ అంటూ సూచించింది. అలాగే కొత్త ఏరోబిక్ వర్కౌట్స్‌ చేస్తూ దీని పేరు ‘ట్రైబల్ స్క్వాట్స్’ అని రాసింది. ఇలా చేయడం వల్ల చురుకుదనం పెరుగుతుందని అంతేకాకుండా మెదడు పనితీరు బాగుంటుందని చెప్పింది.

కాగా 2009లో రాజ్‌కుంద్రాను రెండో వివాహం చేసుకున్న శిల్పాశెట్టి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం రియాలిటీ షోలతో బిజీగా ఉన్న ఆమె ఇటీవల సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రా అరెస్ట్‌ అనంతరం శిల్పాశెట్టి కొన్ని రోజుల పాటు షూటింగ్‌కు హాజరుకాలేదు.

Mysterious Death: బిస్కెట్లు, చిప్స్ తిని కుప్పకూలిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. 24 గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు..

Indian Navy Recruitment: ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. 2500 ఖాళీల భర్తీతో భారీ నోటిఫికేషన్‌..

కాశ్మీర్ వలస కూలీలకు హెచ్చరిక.. పౌరులను హత్య చేసింది తామే.. ప్రకటించిన యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్