Samantha VS Nayanthara : నయన్, సమంతల మధ్య నలిగిపోనున్న సేతుపతి

Samantha VS Nayanthara : విజయ్ సేతుపతి ఇప్పుడు సౌత్‌లో మంచి రైజ్‌లో ఉన్న యాక్టర్. సమంత సౌత్‌లో స్టార్ హీరోయిన్. ఇక నయనతార లేడీ సూపర్‌స్టార్. ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎట్టా ఉంటంది. ఫ్యాన్స్‌కి పూనకాలే కదా..ఇప్పుడే అదే కాంబో రాబోతుంది. డైరెక్టర్ నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్.  ఆ సినిమా పేరు ‘‘కాతు వాకుల రెండు కాదల్’’. మూవీకి సంబంధించిన 37 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియో కూడా […]

Samantha VS Nayanthara : నయన్, సమంతల మధ్య నలిగిపోనున్న సేతుపతి
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 15, 2020 | 10:33 PM

Samantha VS Nayanthara : విజయ్ సేతుపతి ఇప్పుడు సౌత్‌లో మంచి రైజ్‌లో ఉన్న యాక్టర్. సమంత సౌత్‌లో స్టార్ హీరోయిన్. ఇక నయనతార లేడీ సూపర్‌స్టార్. ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎట్టా ఉంటంది. ఫ్యాన్స్‌కి పూనకాలే కదా..ఇప్పుడే అదే కాంబో రాబోతుంది. డైరెక్టర్ నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్.  ఆ సినిమా పేరు ‘‘కాతు వాకుల రెండు కాదల్’’. మూవీకి సంబంధించిన 37 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియో కూడా రిలీజ్ చేశారు. దాన్ని బట్టి ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థమవుతోవంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ మూవీకి  అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. మరి ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తారో, లేదో చూడాలి.

వాస్తవానికి 3 ఏళ్ల క్రితమే ఈ మూవీని విగ్నేష్ శివన్ ప్రకటించారు.  అప్పుడు విజయ్ సేతుపతి, నయనతార, త్రిషలను హీరో,హీరోయిన్లుగా ప్రకటించారు. కానీ అనివార్య కారణాలు వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తాజాగా త్రిష ప్లేసును సమంత రిప్లేస్ చేసింది. మరి ఈ మూవీ తమిళనాట ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.