Shruti Haasan: పెళ్లి ప్లాన్స్ గురించి శ్రుతి హాసన్ రియాక్షన్.. ఆసక్తికర కామెంట్ చేసిన సలార్ బ్యూటీ..

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తుంది. ఇందులో కథానాయిక ఆద్య పాత్రలో కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ.

Shruti Haasan: పెళ్లి ప్లాన్స్ గురించి శ్రుతి హాసన్ రియాక్షన్.. ఆసక్తికర కామెంట్ చేసిన సలార్ బ్యూటీ..
Shruthi Haasan

Updated on: Jul 02, 2022 | 7:46 AM

శ్రుతి హాసన్ (shruthi haasan).. ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ అమ్మడు. క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రుతి..ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తుంది. ఇందులో కథానాయిక ఆద్య పాత్రలో కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ. సెన్సెషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో చాలా మంది ముద్దుగుమ్మలు పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. కాజల్, అలియా, నయన్ వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతికి పెళ్లి ప్లాన్స్ గురించి అడగ్గా.. ప్రస్తుతం తనకు ఎలాంటి ప్లాన్స్ లేవని.. పెళ్లి గురించిన ఎలాంటి సమాధానాలు లేవంటూ చెప్పుకొచ్చింది. అయితే వివాహం గురించి శ్రుతి హాసన్ ఇలాంటి ఆసక్తికర రియాక్షన్స్ ఇవ్వడం మొదటి సారి కాదు. గతంలోనూ తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి విషయంలో తాను ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోలేనని తెలిపింది. ప్రస్తుతం శ్రుతి హాసన్ విజువల్ శాంతాను హజారికాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us