Virupaksha: విరూపాక్ష సినిమాకు సంయుక్త ఫస్ట్ ఛాయిస్ కాదట.. ఆ హీరోయిన్ చేసుంటే..

ఇప్పుడు పూర్తిగా కోలుకున్న తేజ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విరూపాక్ష అనే సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

Virupaksha: విరూపాక్ష సినిమాకు సంయుక్త ఫస్ట్ ఛాయిస్ కాదట.. ఆ హీరోయిన్ చేసుంటే..
Virupaksha

Updated on: Aug 08, 2023 | 8:45 AM

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా వరుసగా హిట్స్ అందుకున్నాడు. ఓ భయంకరమైన రోడ్డు ప్రమాదం నుంచి బయట పడ్డ సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న తేజ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విరూపాక్ష అనే సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో అమ్మడి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా సంయుక్తమీనన్ ను ఎంపిక చేయలేదట. ఆమె కంటే ముందు మరో హీరోయిన్ ను విరూపాక్ష కోసం అనుకున్నారట. ఆమె ఎవరంటే..

హరర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు మంచి ఆదరణను అందుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే చాలా సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే విరూపాక్ష సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. కార్తీక్ దండు తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

సంయుక్త మీనన్ ప్లేస్ లో ముందుగా సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారట. సాయి పల్లవి తన సహజ నటనతో తెలుగులో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆమె అయితే ఈ సినిమాకు కరెక్ట్ గా సరిపోతుందని అనుకున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదించారట కూడా.. కానీ అనుకోని కారణంతో ఆమె ప్లేస్ లో సంయుక్త మీనన్ ను తీసుకున్నారట. అయి పల్లవి చేసుంటే ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చి ఉండేది అని అంటున్నారు విశ్లేషకులు. ఇక సంయుక్తమీనన్ విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆతర్వాత బింబిసార, ధనుష్ నటించిన సర్ సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. అయితే సార్ సినిమాతర్వాత సంయుక్త మీనన్ సైలెంట్ అయిపొయింది. ఆమె నుంచి  కొత్త సినిమా అప్డేట్ రాకపోవడంతో సంయుక్త ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..