Premam: మూడోసారి రీ రిలీజ్ అయిన ప్రేమమ్.. రికార్డ్ స్థాయిలో కలెక్షన్

మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది సాయి పల్లవి. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ హీరోగా నటించిన ప్రేమమ్ సినిమా సంచలన విజయం సాధించింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇదే సినిమాను తెలుగులో అక్కినేని నాగచైతన్యతో రీమేక్ చేశారు. అయితే సాయి పల్లవి ప్లేస్‌లో తెలుగులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది.

Premam: మూడోసారి రీ రిలీజ్ అయిన ప్రేమమ్.. రికార్డ్ స్థాయిలో కలెక్షన్
Premam

Updated on: Feb 06, 2024 | 3:13 PM

సాయి పల్లవి.. తన సింప్లీసిటీతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్‌తో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి సక్సెస్ సాధించింది సాయి పల్లవి. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది సాయి పల్లవి. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ హీరోగా నటించిన ప్రేమమ్ సినిమా సంచలన విజయం సాధించింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇదే సినిమాను తెలుగులో అక్కినేని నాగచైతన్యతో రీమేక్ చేశారు. అయితే సాయి పల్లవి ప్లేస్‌లో తెలుగులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ప్రేమమ్ సినిమా తెలుగులో పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇదిలా ఉంటే మలయాళ ప్రేమమ్ ఇప్పటికే రెండు సార్లు రీ రిలీజ్ అయ్యింది.

ఇటీవల రీ రిలీజ్‌ల హడావిడి నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి సందడి చేశాయి. అంతే కాదు కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ చేశాయి. తాజాగా మూడో సారి రీ రిలీజ్ అయిన ప్రేమమ్ సినిమా కూడా కలెక్షన్స్ కుమ్మేసింది. ఈ సినిమాకు మరోసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఫిబ్రవరి 1న ప్రేమమ్ సినిమా కేరళలో మూడో సారి రీ రిలీజ్ అయ్యింది. ఐదు రోజుల్లోనే రెండు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. మళయాళంలోనే కాదు త‌మిళంలొనూ రీ రిలీజ్ అయ్యింది ఈ సినిమా. తమిళ్, మ‌ల‌యాళంలో రీ రిలీజ్ సినిమాల్లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీస్‌లో ఒక‌టిగా ప్రేమ‌మ్ నిలిచింది.

సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..

సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.