Republic Pre-Release Event: ఘనంగా సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవర్ స్టార్..

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా రిపబ్లిక్. విభిన్నమైన కథలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవకట్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 

Republic Pre-Release Event: ఘనంగా సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవర్ స్టార్..

Updated on: Sep 25, 2021 | 6:21 PM

Republic: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా రిపబ్లిక్. విభిన్నమైన కథలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవకట్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో తేజ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్స్.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది..

తాజాగా రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతుంది. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తేజ్ సినిమాకోసం మెగా ఫ్యామిలీ కదిలింది. రిపబ్లిక్ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయగా… నేడు జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.. వరుస ఫ్లాప్‌లనుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తిరిగి సక్సెస్ ట్రాక్‌లో కంటిన్యూ అవుతున్నాడు తేజ్. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ నుంచి చిత్రలహరి సినిమా తేజ్‌ను బయటపడేసింది. అప్పటినుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. ఈ క్రమంలో వస్తున్న రిపబ్లిక్ సినిమా కూడా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sankranti 2022 – Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..

Parineeti Chopra: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ అందాలను వలకపోస్తున్న పరిణితీ చోప్రా లేటెస్ట్ ఫొటోస్..

Mahesh Babu: మహేష్ వాడిన మొదటి మొబైల్ ఏంటో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన సూపర్ స్టార్..