Sai Dharam Tej: పావలా శ్యామలకు సాయి ధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. ప్రాణ భిక్ష పెట్టారంటూ కన్నీరుమున్నీరైన నటి.. వీడియో

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గొప్ప మనసును చాటుకున్నారు. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సీనియర్‌ నటి పావలా శ్యామలకు తేజ్‌ ఆర్థికసాయం చేశారు. అంతేకాదు వీడియో కాల్ ద్వారా ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. నటి ఆరోగ్య పరిస్థితి, ఇబ్బందుల గురించి ఆరా తీసి ధైర్యం చెప్పారు.

Sai Dharam Tej: పావలా శ్యామలకు సాయి ధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. ప్రాణ భిక్ష పెట్టారంటూ కన్నీరుమున్నీరైన నటి.. వీడియో
Sai Dharam Tej, Pavala Shyamala

Updated on: Jul 26, 2024 | 6:36 PM

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గొప్ప మనసును చాటుకున్నారు. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సీనియర్‌ నటి పావలా శ్యామలకు తేజ్‌ ఆర్థికసాయం చేశారు. అంతేకాదు వీడియో కాల్ ద్వారా ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. నటి ఆరోగ్య పరిస్థితి, ఇబ్బందుల గురించి ఆరా తీసి ధైర్యం చెప్పారు. తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌కు సాయిధరమ్‌తేజ్‌ రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందులో భాగంగా రూ.లక్షను నటి పావలా శ్యామలకు అందజేశారు. కాగా సాయి ధరమ్ తేజ్ సాయంపై పావలా శ్యామల ఎమోషనల్ అయ్యారు. ‘మా అమ్మాయికి ఆపరేషన్‌ అయినప్పుడు సాయిధరమ్‌ తేజ్‌ నాకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. తనే వచ్చి స్వయంగా కలుస్తానన్నాడు. చాలా రోజులైపోయింది. ఇక నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను. కానీ, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేశారు. ఇందుకు ఆయనకు నా ధన్యవాదాలు’ అని కన్నీరు పెట్టుకున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ తో వీడియో కాల్ లో మాట్లాడుతూ ‘ ప్రస్తుతం నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. చనిపోదామనుకుంటున్నాను. ఇంతకుముందే మీ కుటుంబం నుంచి చిరంజీవి గారు రెండు లక్షలు ఇచ్చారు. సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టారు’ ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ నటి. ఈ మాటలకు సాయి ధరమ్ తేజ్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ‘ మీరు కన్నీళ్లు పెట్టుకుంటుంటే చాలా కష్టంగా ఉంది. ఏడవకండి’ అంటూ శ్యామలను ఓదార్చారు.

కాగా తెలుగులో పలు సినిమాల్లో హాస్య నటిగా, సహాయ నటిగా కనిపించారు పావలా శ్యామల. మనసంతా నువ్వే, ఖడ్గం, ఆంధ్రావాలా, గోలీమార్ తదితర సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే వయసు మీద పడడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఆమెను చుట్టు ముట్టాయి. దీంతో రెండేళ్ల క్రితం రిలీజైన ‘మత్తువదలరా’ సినిమా తర్వాత ఆమె మరో సినిమాలో కనిపించలేదు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ప్రస్తుతం ఆర్థికంగానూ, ఆరోగ్యంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటోన్న పావలా శ్యామల తన కుమార్తెతో కలిసి హైదరాబాద్‌లోని ఓ అద్దె గదిలో నివాసముంటున్నారు. గతంలో ఆమె దీన పరిస్థితికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తదితరులు ఆమెకు ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. ఆమె ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ గతంలో ఆర్థికసాయం అందించిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us