మెగా ఇంట పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుక.. వైరల్ అవుతున్న ఫొటోలు!

మెగా మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సాయి దుర్గతేజ్. తనదైన యాక్టింగ్, స్టైల్, డ్యాన్స్ లతో సుప్రీం హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో రోడ్డు ప్రమాదం కారణంగా కెరీర్ లో కొంచెం వెనకపడినా రీఎంట్రీలో విరూపాక్ష సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడీ ట్యాలెంటెడ్ హీరో.

మెగా ఇంట పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుక.. వైరల్ అవుతున్న ఫొటోలు!
Saidharamtej

Updated on: Nov 05, 2026 | 9:17 PM

మెగా కుటుంబంలో మరో శుభకార్యం సందడి నెలకొంది. టాలీవుడ్ యంగ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. నవంబర్ 5న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరైనట్లు తెలుస్తోంది. అందరూ సంప్రదాయ దుస్తుల్లో సందడి చేస్తూ వేడుకలో పాల్గొన్న ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చాలా కాలం తర్వాత మెగా కుటుంబంలో మరో పెళ్లి వేడుక జరగనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయం గురించి గత కొంతకాలంగా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. తేజ్ చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

నిశ్చితార్థం తర్వాత డిసెంబర్‌లో వివాహ వేడుక నిర్వహించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 10న పెళ్లి ఉండొచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పెళ్లి తేదీ, వేదికకు సంబంధించి అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది. సాయి ధరమ్ తేజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వార్తలు మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తమ అభిమాన హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్తతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్న సాయి ధరమ్ తేజ్.. సినిమాల పరంగానూ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. మొత్తానికి అటు సినిమాలు, ఇటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో సాయి ధరమ్ తేజ్ మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us