AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న సినిమా అనుకున్నారు.. కట్ చేస్తే థియేటర్లకు పోటెత్తిన జనం.. ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ

చాలా సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తా కొడుతుంటాయి. ఇక మనం మాట్లాడుకుంటున్న సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు.

చిన్న సినిమా అనుకున్నారు.. కట్ చేస్తే థియేటర్లకు పోటెత్తిన జనం.. ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ
Movie
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2026 | 5:58 PM

Share

దర్శకుడు శ్రీను వైట్ల పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది థియేటర్లలో నవ్వుల పూలు పూయించిన కామెడీ ట్రాక్స్, నాన్-స్టాప్ ఎంటర్‌టైన్మెంట్. ‘దూకుడు’ లాంటి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్లతో టాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలు సృష్టించిన ఈ సెన్సేషనల్ డైరెక్టర్, అంతకుముందే తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్‌ను అందించారు. అదే క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఆనందం’. విడుదలై ఇన్నేళ్లు అవుతున్నా నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్న ఈ ఎవర్ గ్రీన్ చిత్రం వెనుక ఉన్న ఆసక్తికర నిర్మాణాత్మక విశేషాలు, సవాళ్లు, అనూహ్య విజయం గురించిన ముచ్చట్లను శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఆనందం’ సినిమాకు అడుగులు పడింది ఒక రాత్రి మెరుపులా వచ్చిన చిన్న ఆలోచనతోనే.. ఆ ఆలోచనను కేవలం 3 రోజుల్లో 80 సీన్ల పూర్తి కథగా అభివృద్ధి చేశారట శ్రీను వైట్ల. అజయ్ శాంతి ద్వారా ఈ కథను రామోజీ రావుకి వినిపించగా.. ఒక్క చిన్న మార్పు కూడా సూచించకుండా వెంటనే “గో అహెడ్” అంటూ ప్రాజెక్ట్‌ను ఓకే చేశారట.

మూఢనమ్మకాలకు దూరంగా ఉండే రామోజీ రావు గారు అప్పట్లో చెప్పిన మాటను శ్రీను వైట్ల ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు: “ఒక చెడ్డ రోజు చూసి షూటింగ్ స్టార్ట్ చేయండి, సినిమా ఎందుకు హిట్ అవ్వదో చూద్దాం!” అని ఆయన ఇచ్చిన భరోసా దర్శకుడిలో కొండంత ధైర్యాన్ని నింపిందట. సినిమా నిర్మాణం అనుకున్న సమయం కంటే చాలా వేగంగా పూర్తయింది. రామోజీ రావు గారు 60 రోజుల షూటింగ్ టైమ్ ఇచ్చినప్పటికీ, శ్రీను వైట్ల పక్కా ప్లానింగ్‌తో కేవలం 42 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. అందులో 19 రోజుల్లో టాకీ పార్ట్, మిగిలిన 23 రోజుల్లో పాటల చిత్రీకరణ ముగించడం విశేషం. పూర్తిగా కొత్త నటీనటులతో, అత్యంత తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన నాన్-కాస్టింగ్ చిత్రం కావడంతో విడుదల రోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అని శ్రీను వైట్ల తీవ్ర ఆందోళన చెందారట. ఆ సమయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆయనకు ఎంతో ధైర్యం చెప్పారట.

రిలీజ్ రోజు ఉదయాన్నే చిత్రబృందం శ్రీనగర్ కాలనీ ఆలయంలో పూజలు ముగించుకుని ట్యాంక్ బండ్ చేరుకునే సరికి, పంపిణీదారుడు మయూరి సుధాకర్ గారు ఫోన్ చేసి ఒక తీపి కబురు అందించారట. ఆంధ్రప్రదేశ్ అంతటా థియేటర్ల వద్ద జనం పోటెత్తారని, సినిమాకు ఊహించని భారీ స్పందన వస్తోందని తెలిపారు. కేవలం ఒక్క మయూరి థియేటర్ నుంచి వచ్చిన షేర్‌తోనే సినిమా మొత్తం బడ్జెట్ రికవర్ అవ్వడం ఆ రోజుల్లో ఒక సంచలనం! ఈ అద్భుతమైన చిత్రాన్ని చూసి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం శ్రీను వైట్లను ప్రత్యేకంగా అభినందించారు. ఆనందం’ విజయానికి ప్రధాన బలాలు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఎం.ఎస్. నారాయణ ‘రాంబాబు’ కామెడీ ట్రాక్. దేవిశ్రీ ప్రసాద్ అందించిన యువతరాన్ని ఊపేసే స్వరాలు ఈ సినిమా ద్వారా ఆయనకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ‘ఎవరైనా ఎప్పుడైనా..’ పాట, జీవితం పట్ల  పోజిటివ్ ఆటిట్యూడ్ నింపుతూ ఆబాలగోపాలాన్ని విశేషంగా ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us