AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny Leone: చిక్కుల్లో సన్నీలియోన్.. రూ. 2,400 కోట్ల భారీ స్కామ్‌లో అందాల భామకు సీఐడీ నోటీసులు

సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు సన్నీ లియోన్. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఫేమస్ అయ్యింది. బాలీవుడ్ తో పాటు అడపాదడపా తెలుగులోనూ నటిస్తూ ప్ర్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సన్నీ ఓ వివాదంలో చిక్కుకుంది.

Sunny Leone: చిక్కుల్లో సన్నీలియోన్.. రూ. 2,400 కోట్ల భారీ స్కామ్‌లో అందాల భామకు సీఐడీ నోటీసులు
Sunnyleone
Rajeev Rayala
|

Updated on: Jun 09, 2026 | 12:10 PM

Share

సన్నీ లియోన్ గురించి తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలో గ్లామరస్ క్వీన్ గా రాణిస్తున్న సన్నీ లియోన్.. తన నటనతోనూ ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సన్నీ లియోన్, సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సన్నీ తెలుగులోనూ నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ సినిమాలో ఆమె ఓ స్పెషల్ రోల్ లో కనిపించి మెప్పించింది. అలాగే మంచి విష్ణు నటించిన జిన్నా సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పిస్తుంది సన్నీ. వీటితోపాటు రాజశేఖర్ హీరోగా నటించిన  గరుడ వేగ సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది సన్నీ.

కాగా ప్రస్తుతం ఈ అందాల భామ బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ చేసింది. అక్కడే ఈ చిన్నది వరుస సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సన్నీ లియోన్ ఊహించని చిక్కుల్లో పడ్డారని తెలుస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివమ్ అసోసియేట్స్ భారీ కుంభకోణంలో సన్నిలియోన్ పేరు బయటకు వచ్చింది. రూ. 2,400 కోట్ల భారీ పోంజీ కుంభకోణంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. శివమ్ అసోసియేట్స్ అధినేత శివానంద నీలణ్ణవర్ దాదాపు 41 వేల మంది ఖాతాదారులను మోసం చేసి ఆ డబ్బుతో సినిమా ఇండస్ట్రీలో విచ్చల విడిగా ఖర్చుచేసినట్టు తెలుస్తుంది.

ఆ డబ్బులతోనే కొన్ని ఈవెంట్స్ కూడా చేశారట అలాగే అదే డబ్బుతో 2023లో ఛాంపియన్’ అనే సినిమా తీశాడు. ఈ సినిమాలో సన్నీలియోన్ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ కోసం సన్నీలియోన్ కోటిరూపాయల రెమ్యునరేషన్ తీసుకుందని సీఐడీ అధికారులు గుర్తించారు. దాంతో ఈ స్కామ్ పై వివరణ ఇవ్వాలని సీఐడీ అధికారులు సన్నీలియోన్ కు నోటీసులు పంపించారు. సన్నీలియోన్ తోపాటు పలువురు కన్నడ సినీ సెలబ్రెటీలకు కూడా సీఐడీ అధికారులు నోటీసులు జరీ చేశారు.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us