RRR: నో కాంప్రమైజ్… ఆర్ఆర్ఆర్ విషయంలో అందుకు ఒప్పుకోని రాజమౌళి ?.. ఆందోళనలో మేకర్స్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.

RRR: నో కాంప్రమైజ్... ఆర్ఆర్ఆర్ విషయంలో అందుకు ఒప్పుకోని రాజమౌళి ?.. ఆందోళనలో మేకర్స్..
Rrr
Follow us

|

Updated on: Oct 26, 2021 | 12:59 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. అత్యంత ప్రాతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముందు నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్ట్రర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టించాయి. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలతో జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రేక్షకులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జక్కన్న ఈ సినిమా బిజినెస్ విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ ధర పలికినట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జనవరి 7న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ డబ్బింగ్ పార్ట్ పూర్తి చేశారు. ఇక సర్వం సిద్ధమవుతున్న సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై మరో ఆసక్తికర టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రన్ టైమ్ దాదాపు మూడు గంటలకు పైగా వచ్చిందట. ఆ రన్ టైమ్ ట్రిమ్ చేసి 2 గంటల 45 నిమిషాలకు తీసుకొచ్చారట రాజమౌళి.. ఇక అంతకంటే తగ్గించడానికి జక్కన్న ఏమాత్రం ఒప్పుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే ఫైనల్ అవుట్ పుట్ అని.. ఇంకా తగ్గించాలని ఎవరు చెప్పిన నో కాంప్రమైజ్ అంటున్నారట రాజమౌళి.. దీంతో మేకర్స్ సందేహంలో పడినట్లుగా టాక్ నడుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్‏ను అన్ని భాషల్లో అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Vijay: ఆ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి.. ఆవేదన వ్యక్తం చేసిన హీరో విజయ్..

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?…. తెలుగులో మోహన్ బాబు సరసన ఈ అమ్మడు నటించిన సినిమా సూపర్ హిట్..