
RRR Making Video Viral: ఇద్దరు అగ్రహీరోలు, బాహుబలిలాంటి సంచలన విజయం సాధించిన దర్శకుడు.. ఇలాంటి క్రేజీ
కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఓవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులతో పాటు యావత్ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఈ సినిమాకోసం ఎదురు చూస్తోంది.
ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా అది వైరల్‌గా మారుతోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తాజాగా షూటింగ్ స్పాట్‌లో తీసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తుంటే భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ వీడియోను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేయకపోయినప్పటికీ యూనిట్ సభ్యులు ఎవరో తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోను ఎన్టీఆర్, చెర్రీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందుకు తగ్గట్లుగానే చిత్ర దర్శకుడు రాజమౌళి సినిమాలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఉండే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బాహుబలి చిత్రంతో ఇండియన్ సినిమా స్థాయిని ఓరేంజ్‌కు తీసుకెళ్లిన జక్కన.. ఆర్.ఆర్.ఆర్‌తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
HUGE Set Erected in RFC’s Biggest Floor For @RRRMovie Climax… #RRRMovie #RRRDiaries @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @DVVMovies pic.twitter.com/KAgIMjcR29
— NTR Trends (@NTRFanTrends) January 30, 2021
Also Read: Anasuya: మరోసారి స్పెషల్ సాంగ్‌లో చిందేయనున్న అందాల అనసూయ.. ‘ఈ పాట సినిమాకే హైలైట్’..