Bubblegum Movie: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘బబుల్ గమ్’.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసా ?..

కమర్షియల్ హిట్ కాకపోయినా రోషన్ కనకాల నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో రోషన్ సరసన మానస చౌదరి కథానాయికగా నటించింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో క్యూరియాసిటిని పెంచేసిన ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇందులో హీరో రోషన్, మానస నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. డైరెక్టర్ రవికాంత్ పేరుపు దర్శకత్వం వహించిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహకారంతో మహేశ్వరి మూవీస్ ఈ సినిమాను నిర్మించింది.

Bubblegum Movie: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న బబుల్ గమ్.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసా ?..
Bubblegum Movie

Updated on: Jan 10, 2024 | 6:31 PM

యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా బబుల్ గమ్ సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. యూత్‏ఫుల్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించింది. కమర్షియల్ హిట్ కాకపోయినా రోషన్ కనకాల నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో రోషన్ సరసన మానస చౌదరి కథానాయికగా నటించింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో క్యూరియాసిటిని పెంచేసిన ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇందులో హీరో రోషన్, మానస నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. డైరెక్టర్ రవికాంత్ పేరుపు దర్శకత్వం వహించిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహకారంతో మహేశ్వరి మూవీస్ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఇందులో హర్ష చెముడు, కిరణ్ జి, అనన్య ఆకుల, హర్షవర్దన్, అను హాసన్, జైరామ్ ఈశ్వర్, బిందు చంద్రమౌళి కీలకపాత్రలు పోషించారు.

థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుందంటూ ప్రచారం నడుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని.. మరో పది రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.

డైరెక్టర్ రవికాంత్ పేరుపు తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ చిత్రం గతేడాది డిసెంబర్ 29న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ విడుదలై కేవలం పది రోజులు మాత్రమే అవుతుంది. అప్పుడే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రచారం నడుస్తుంది. కమర్షియల్ హిట్ కాకపోయిన.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రోషన్. ఇక థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.