సినిమా స్టార్స్ కు ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక డై హార్ట్ ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. తమ అభిమాన హీరోల కోసం ఏమైనా చేస్తుంటారు ఫ్యాన్స్. కొన్ని సార్లు స్టేజ్ పైన తమ అభిమాన హీరో మాట్లాడుతుంటే అక్కడికి దూసుకు వచ్చి ఆ హీరోల కాళ్ళ మీద మాడుతూ ఉంటారు. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. అయితే కొన్ని సార్లు రివర్స్ లో ఆ స్టార్ హీరోలే అభిమానుల కాళ్లు పట్టుకుంటుంటారు. తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా ఆ మధ్య ఓ అభిమాని తన కాళ్లకు నమస్కరిస్తుంటే వెంటనే ఆయన కూడా అభిమాన కాళ్లకు నమస్కరించాడు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ కూడా అదే చేశాడు. తాజాగా మరో హీరో కూడా అభిమాని కాళ్లు పట్టుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు..
సాధారణంగా బాలీవుడ్ లో అభిమానులు వచ్చి మీద పడుతుంటే ఆ హీరోలు సీరియస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఓ లేడీ ఫ్యాన్ కాళ్లు పట్టుకున్నాడు హీరో రితేష్ దేశ్ ముఖ్. తొలిసారి మరాఠీలో `వేద్` మూవీలో నటిస్తూ తానే స్వయంగా తెరకెక్కిస్తున్నాడు రితేష్.ఈ సినిమా మన మజిలీ సినిమాకు రీమేక్ . జెనీలియా హీరోయిన్ గా నటిస్తుంది.
చాలా కాలాంతర్వత ఇలా భార్యాభర్తలు కలిసి నటిస్తున్నారు. డిసెంబర్ 30న భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈసందర్భంగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా..ఓ కాలేజీ క్యాంపస్ కు వెళ్లారు చిత్రయూనిట్. ఆ సమయంలో ఓ యువతి స్టేజ్ పైకి వచ్చి రితేష్ తో కలిసి డాన్స్ సి చేయాలనీ ఉందని కోరింది. వెంటనే రితేష్ ఆమె తో కలిసి డాన్స్ చేశాడు. దాంతో ఆమె ఆనందం ఆపుకోలేక బోరున ఏడుస్తూ.. అతడి కాళ్లు పట్టుకుంది. వెంటనే రితేష్ ఆమెను పైకి లేపి ఆమె కాళ్లు పట్టుకున్నాడు. రితేష్ ప్రవర్తనకు అక్కడ ఉన్నవారంతా ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.