Actor Navdeep : హీరో నవదీప్‏కు ఊరట.. అరెస్ట్ చేయొద్దని హైకోర్ట్ ఆదేశాలు..

గుడి మల్కాపూర్ పోలీసులతో కలిసి నార్కోటిక్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ లో మొత్తం 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ కేసులో నవదీప్ కన్జ్యూమర్ గా ఉన్నాడని.. అతడిని త్వరలోనే అరెస్ట్ చేయనున్నారని మాదాపూర్ పోలీసులు తెలిపారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు హీరో నవదీప్. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అతడిని అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Actor Navdeep : హీరో నవదీప్‏కు ఊరట.. అరెస్ట్ చేయొద్దని హైకోర్ట్ ఆదేశాలు..
Navdeep Pallapolu

Updated on: Sep 15, 2023 | 4:42 PM

మాదాపూర్ డ్రగ్స్ కేసుతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉలిక్కిపడింది. గుడి మల్కాపూర్ పోలీసులతో కలిసి నార్కోటిక్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ లో మొత్తం 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ కేసులో నవదీప్ కన్జ్యూమర్ గా ఉన్నాడని.. అతడిని త్వరలోనే అరెస్ట్ చేయనున్నారని మాదాపూర్ పోలీసులు తెలిపారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు హీరో నవదీప్. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అతడిని అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మాదాపూర్ డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్ విభాగం పోలీసులు..మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. గత నెల 31 గుడిమల్కాపూర్, మాదాపూర్‌లో దాడి చేసి వెంకట్ రత్నాకర్‌ రెడ్డి, బాలజీ, మురళిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ నెల 13న ఎనిమిది మంది అంటే ముగ్గురు నైజీరియన్లు, ఐదుగురు వినియోగదారులు డ్రగ్స్ నిందితులను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. గురువారం మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ముగ్గురు నైజేరియన్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. విసా గడువు ముగిసినా నైజేరియన్స్ ఇంకా దేశంలోనే ఉన్నారని అన్నారు. వారి నుంచి డ్రగ్స్‌తోపాటు ఎస్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అలాగే డ్రగ్స్‌ కేసులో ఉన్న మోడల్‌ శ్వేతా సహా మరో 17 మంది పరారీలో ఉన్నట్లు నార్కొటిక్‌ పోలీసులు తెలిపారు. వారికోసం గాలిస్తున్నామని.. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్న 8 మంది నిందితులను కోర్టులో హాజరు పర్చగా.. ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది హైకోర్ట్. దీంతో నిందితులను కోర్టు నుంచి జైలుకు తరలించారు.

అయితే ఈ కేసులో డ్రగ్స్ కన్జ్యూమర్ గా నవదీప్ ఉన్నట్లు అతడి స్నేహితుడు రాంచందర్ తెలిపినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం నవదీప్ పరారీలో ఉన్నారని.. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అన్నారు. అయితే ఈ కేసులో బయటకు వచ్చిన నవదీప్ తాను కాదని..తన ఫోన్స్ అన్ని ఆన్ లోనే ఉన్నాయన్నారు నవదీప్. ఈ కేసు విషయమై తనను అరెస్ట్ చేయొద్దని కోర్టును ఆశ్రయించారు నవదీప్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.