Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వర రావు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. అతిథులు ఎవరంటే..

ఓవైపు డైరెక్టర్ వంశీ, హీరో రవితేజ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ వంశీ వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 20న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేశాయి.

Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వర రావు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. అతిథులు ఎవరంటే..
Tiger Nageswara Rao

Updated on: Oct 14, 2023 | 7:43 PM

ఈ ఏడాది దసరా కానుకగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు ‘టైగర్ నాగేశ్వర రావు’.. మాస్ మాహారాజా రవితేజ కెరియర్‏లో తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సినిమా ఇది. దీంతో దేశంలోని ముఖ్య నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఓవైపు డైరెక్టర్ వంశీ, హీరో రవితేజ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ వంశీ వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 20న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేశాయి. అంతేకాకుండా ఇందులో మాస్ మాహారాజా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.

ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 15న అంటే రేపు ఆదివారం టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే ఈ వేడుకకు కిషన్ రెడ్డి.. రచయిత విజయేంద్ర ప్రసాద్, హరీశ్ శంకర్, గోపిచంద్ మలినేని, చందూ మొండేటి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.


ఈ సినిమాలో రవితేజ జోడిగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్, గాయత్రి కథానాయికలుగా నటించారు. అలాగే ఇందులో సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.