Ravanasura Twitter Review: రవితేజ ‘రావణాసుర’పై నెటిజన్స్ రియాక్షన్.. మూవీ ఎలా ఉందంటే

|

Apr 07, 2023 | 7:09 AM

ఇప్పుడు రావణాసురగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Ravanasura Twitter Review: రవితేజ ‘రావణాసుర’పై నెటిజన్స్ రియాక్షన్.. మూవీ ఎలా ఉందంటే
Ravanasura
Follow us on

మాస్ మహారాజ రవితేజ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో హిట్స్ అందుకున్న రవితేజ. ఇప్పుడు రావణాసురగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ మూవీ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ మూవీలో అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. అలాగే ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు.

ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో రవితేజ హ్యాట్రిక్ హిట్ అందుకుంటారని అంటున్నారు రవితేజ ఫ్యాన్స్. ఈ మూవీ ఇప్పటికే ప్రీమియర్స్ జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు నెటిజన్స్.