Ramarao on Duty Twitter Review: ప్రేక్షకుల ముందు ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా.. మాస్ హిట్ అంటున్న ఫ్యాన్స్

మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ(Ramarao on Duty )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Ramarao on Duty Twitter Review: ప్రేక్షకుల ముందు రామారావు ఆన్ డ్యూటీ సినిమా.. మాస్ హిట్ అంటున్న ఫ్యాన్స్
Rama Rao On Duty

Updated on: Jul 29, 2022 | 7:52 AM

మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ(Ramarao on Duty )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే జరగడంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. రవితేజ మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో ఈ సినిమాలో కనిపించాడు. రిలీజ్ కు ముందు వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. మరి మాస్ రాజా సినిమాకు ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా ఎలాంటి రివ్యూ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి